అవును పెద్దల సభకు ఎన్నికయ్యేందుకు ఏకంగా రూ.70 కోట్లు ఖర్చు పెట్టేందుకు ఆయన సిద్ధపడ్డారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ మంచి నీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేస్తుండగా ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గంలో బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి ఏకంగా రూ. 70 కోట్లు కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బోగస్ - తమ అనుకున్నవారి ఓట్లను చేర్పించడంలో కొంత మేరకు ఆయన సక్సెస్ అయ్యారని, అయినప్పటికీ ఓట్లు పడతాయో లేదోనన్న ఆలోచనతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు - ట్యాబ్ లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతోపాటుగా మిగతా వ్యవహారాలన్నింటికీ కలిపి రూ.70 కోట్లు కేటాయించినట్లు సమాచారం. యువతను ఆకర్షించేందుకు ఓటర్లలో సగం మందికి స్మార్ట్ ఫోన్లు - ట్యాబ్ లను ఇచ్చేందుకు పకడ్బందీ వ్యూహ రచన చేసినట్లు ఆ మూడు జిల్లాల టీడీపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో అనూహ్యంగా తెరమీదకొచ్చిన టీడీపీ అభ్యర్థి గతంలో ఒక కార్పొరేట్ విద్యాసంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేశారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాకే చెందిన మంత్రి ఒకరు చంద్రబాబును - లోకేష్ ను ఒప్పించి ఆయనకు టిక్కెట్ ఇప్పించినట్లు సమాచారం. ఆ అభ్యర్థి ముందు నుంచే పక్కా ప్లాన్ తో కార్పొరేట్ విద్యా సంస్థల్లో పని చేసే వారిని, తమ అనుకున్నవారిని పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించినట్లు ఆరోపణలొస్తున్నాయి. తాను దగ్గరుండి లక్షా 60 వేల ఓట్లు చేర్చించానని, కచ్చితంగా గెలుస్తానని పార్టీ నేతలతో అంటున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లోకెల్ల ఈ నియోజకర్గంలోనే అత్యధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న ప్రఖ్యాత మొబైల్ కంపెనీకి టీడీపీ సర్కారు భూములు కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ సంస్థను సీఎం చంద్రబాబు ప్రారంభించారు కూడా. కాగా ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్లు - ట్యాబ్ లు తయారు చేయాలని సదరు మొబైల్ కంపెనీకి టీడీపీ అభ్యర్థి ఆర్డర్ ఇచ్చారని తెలిసింది. లక్ష స్మార్ట్ ఫోన్లకు ఆయన సన్నిహితులు ఇండెంట్ పెట్టారని, ఒక్కో మొబైల్ రూ.6 వేలు అవుతోందని, ఆ లెక్కన లక్ష ఫోన్లకు రూ.60 కోట్లు ఖర్చవుతోందని టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. అలాగే పది వేల వరకు ట్యాబ్‌లను పంపిణీ చేసేందుకు అదే కంపెనీకి టీడీపీ అభ్యర్థి అనుచరులు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. ఒక్కో ట్యాబ్ తక్కువలో తక్కువ రూ.10 వేలుంటుందని, పదివేల ట్యాబ్‌లకూ కలిపి రూ.10 కోట్లు ఖర్చవుతోందని చెబుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 20 వేల 554 మంది ఓటర్లుండగా అందులో లక్షా పది వేల మందికి స్మార్ట్ ఫోన్లు - ట్యాబ్ లు ఇచ్చేందుకు స్కెచ్ వేసినట్లు ఆరోపణలొస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/