పీవీపీ దేశ సేవ చేసేవాడా పవన్‌!?

Update: 2015-07-08 17:30 GMT
జన సేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రా ఎంపీలపై దుమ్మెత్తిపోశాడు. మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మీద అయితే విరుచుకుపడ్డారు. ఇంతకీ నాని మీద పవన్‌ ఎందుకు విరుచుకుపడ్డారు అంటే కొంతమంది టీడీపీ నాయకులు ఇందుకు ఒక సూత్రీకరణ చెబుతున్నారు.

ఎన్నికల ముందు విజయవాడ టికెట్‌ తనకు కావాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు. తనకు అత్యంత ఆప్తుడు అయిన పొట్లూరి వరప్రసాద్‌ ఉరఫ్‌ పీవీపీకి ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. అయితే, పాదయాత్రలో భాగంగా కేశినేని నానికి చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో విజయవాడ ఎంపీ సీటు విషయమై పీట ముడి పడింది. ఈ సీటు ఎవరికి దక్కుతుందనే చర్చలు తీవ్రస్థాయిలో జరిగాయి. చివరికి భారీగా ఖర్చు చేసిన తర్వాత ఆ సీటు నానికే దక్కింది.

అప్పట్లో తాను కోరిన విజయవాడ సీటును తనకు లేదా తాను సూచించిన పీవీపీకి ఇవ్వలేదనే కోపంతోనే పవన్‌ ఇప్పుడు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఆ సీటును పీవీపీకి ఇచ్చి ఉంటే.. ఆయన గెలిచి ఉంటే.. ఆయన పార్లమెంటుకు వెళ్లి ఉంటే ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం గొంతు చించుకుని పోరాడేవారా? ఆయన తన వ్యాపార ప్రయోజనాలను చూసుకునేవారా? ఆయన దేశ సేవ చేసేవారా? సొంత సేవ చేసుకునేవారా? అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు పవన్‌ జవాబు చెప్పాల్సిందే!!

Tags:    

Similar News