ఒక్కతాటిపై నిలబడే పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? టీడీపీ అధినేత చంద్రబాబు మాటే వేదంగా సాగే పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా కీలక అంశాలపై స్పందించడం వ్యూహంలో భాగమా లేక కట్టుతప్పిన క్రమశిక్షణకు నిదర్శనమా అని ఇటు పార్టీ నేతల్లో పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రత్యేకహోదా - విభజన హామీల అమలు కోసం ప్రధానమం నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు తలోరకంగా మాట్లాడుతుండటంతో ఈ చర్చ తెరమీదకు వస్తోంది.
రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మార్చి 5వ తేదిలోగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటామని - అదే రోజు తమ పార్టీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని - చంద్రబాబునాయుడు ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రకటించారు. దీంతో మీడియాలోనూ - రాజకీయ వర్గాల్లోనూ కలకలం బయలుదేరింది. టీడీపీ కౌంటర్ తో జగన్ చిక్కుల్లో పడ్డారని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఆదినారాయణరెడ్డి ప్రకటనపై పలువురు కేంద్రమంత్రులు - టీడీపీి ఎంపీిలు ఆరా తీసినట్లు సమాచారం. ఈ హడావిడి సాగుతుండగానే రంగంలోకి దిగిన టీడీపీ ఎంఎల్ సి వైవిబి రాజేంద్రప్రసాద్ ఆదినారాయణరెడ్డి ఆవేశంలో మాట్లాడారని - అటువంటి నిర్ణయమేమి తీసుకోలేదని తేల్చివేశారు. ఆ తరువాత కాసేపటికే మళ్లీ మీడియా ముందుకు వచ్చిన ఆదినారాయణరెడ్డి ఐదవ తేది తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారన్నది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నారు. తన ప్రకటనకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వివరించారు.
అదే సమయంలో ఏలూరులో మాట్లాడిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్చి5న చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పాదయాత్రకు జనం రాకపోవడంతోనే జగన్ రాజీనామాల డ్రామాను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడిన హోంశాఖ మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప కూడా మార్చి 5వ తేదిన అనూహ్య నిర్ణయం ఉంటుందని చెప్పారు. జగన్ కపట నాటకాలాడుతున్నారని - ఆయనకు చిత్తశుద్ది ఉంటే తక్షణమే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మాట్లాడిన టీడీపీ నాయకులు కూడా ఇదే విధంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వీరి ప్రకటనలు సాగుతున్నప్పటికీ వీటిలో స్పష్టత ఉండటం లేదని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తోందా... ప్రజానీకం నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడితో తడబాటుకు గురవుతోందా అన్న సందేహం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.