ఏపీలో అధికార.. విపక్షానికి మధ్య మాటల దాడి మరింత ముదిరింది. గడిచిన మూడు.. నాలుగురోజుల్లో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన్నురాళ్లతో కొట్టాలని ఒకసారి.. తాజాగా చెప్పులతో కొట్టాలంటూ పిలుపునివ్వటంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
జగన్ ను సైకోగా కొందరు నేతలు అభివర్ణిస్తుంటే.. మరికొందరు మైండ్ సెట్ పూర్తిగా చెడిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు నీళ్లు ఇచ్చి వేలాది ఎకరాల పంటను కాపాడి రైతులను ఆదుకున్నది జగన్ కంటికి ఎందుకు కనిపించదంటూ తెలుగు తమ్ముళ్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. జగన్ క్రిమినల్ మనస్తత్వానికి నిదర్శనమే ఆయన వ్యాఖ్యలని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ తాత రాజారెడ్డి వారసత్వం నిలబెట్టేలా ఆయన మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేతలు తిట్ల పురాణం అందుకున్నారు.
తమ అధినేతను చెప్పులతో.. రాళ్లతో కొట్టమంటున్న జగన్ ను 2014 ఎన్నికల్లో సీమాంధ్ర ప్రజలు ఓట్లతో కొట్టారని.. 2019లో కూడా మళ్లీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి ఫైర్ అయ్యారు. సభ్యత.. సంస్కారం లేకుండా కొవ్వెక్కి అహంకారంతో మాట్లాడుతున్నారని.. ఇలాంటి వ్యక్తి ఏపీ విపక్ష నేతగా ఉండటం దురదృష్టకరంగా ఆయన అభివర్ణించారు. మరోవైపు ఫైర్ బ్రాండ్ మంత్రి దేవినేని ఉమ చెలరేగిపోయారు. జగన్ కు పర్సనాలిటీ డిజార్డర్ ఉందని.. ఆయన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే సమాజమనే తులసి వనంలో జగన్ గంజాయి మొక్క లాంటివాడంటూ వర్ల రామయ్య మండిపడుతున్నారు.
చెప్పులతో..రాళ్లతో ముఖ్యమంత్రి చంద్రబాబును కొట్టాలంటూ జగన్ విపరీత వ్యాఖ్యలు చేస్తే.. తాము సైతం ఏ మాత్రం తక్కువ తినలేదన్నట్లుగా విపక్ష నేతలు వ్యాఖ్యలు చేయటం గమనార్హం. కొవ్వెక్కి లాంటి మాటల్ని ఏపీ అధికార పక్ష నేతలు వాడకుండే హుందాగా ఉంటుంది. ఒకరు గీత దాటారని.. అందరూ దాటాల్సిన అవసరం లేదు కదా..?