చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేతల స్విచ్ ఆఫ్

Update: 2020-06-16 07:15 GMT
టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా టీడీపీ నేతల అరెస్ట్ పై యుద్ధానికి సిద్ధమవుతున్న చంద్రబాబుకు టీడీపీ నేతల మద్దతు కరువవుతోంది. జేసీ బ్రదర్స్ కు మద్దతు ఇవ్వాలని భావించిన చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే పెద్ద షాక్ ఇచ్చారు.

జేసీ బ్రదర్స్ కుటుంబానికి నైతిక మద్దతును ఇచ్చేందుకు ఆయన తరుఫున టీడీపీ నేతలంతా కలిసి ఫైట్ చేయడానికి అనంతపురంలోని తాడిపత్రికి వెళ్లారు నారా లోకేష్. జేసీ కుటుంబాన్ని పరామర్శించారు. అయితే అదే అనంతపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేతలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లు లోకేష్ వచ్చినా మొఖం చాటేశారు. జేసీ ఫ్యామిలీని, లోకేష్ ను కలవడం మానుకున్నారు.

వీరిద్దరే కాదు.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఉన్నం హనుమంత చౌదరి, జితేంద్రగౌడ్, కండికుంట ప్రసాద్ కూడా జేసీ ఫ్యామిలీకి మద్దతుగా లోకేష్ తో కలిసి రాకపోవడం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 నకిలీ పత్రాలతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో చిక్కుకున్న జేసీ కుటుంబానికి ఎందుకు మద్దతు ఇవ్వాలని.., సానుభూతి చూపాలని టిడిపి నాయకులు అంతా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

నారా లోకేష్ పర్యటనలో పాల్గొనమని టిడిపి కార్యాలయం ఆ ప్రాంతంలోని నాయకులందరినీ తెలియజేసినా కూడా ఆశ్చర్యకరంగా నాయకులు తమ మొబైల్‌లను స్విచ్ ఆఫ్ చేయడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ ను కలవకుండా నేతలంతా వారి ఇళ్లకు పరిమితం కావడం గమనార్హం. దీంతో చంద్రబాబు ఆదేశించినా జేసీ ఫ్యామిలీకి సపోర్టు చేయడానికి నేతలంతా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News