రాజకీయాలన్నాక విమర్శలు కామన్. కానీ.. ఒకరిని చూసి ఒకరు భయపడిపోవటం చాలా అన్ కామన్. అసెంబ్లీలో కానీ.. మరే ఇతర బహిరంగ వేదికల మీద కానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడే నేతలు.. ఒకరికొకరు ఎదురుపడినప్పుడు కులాశాగా మాట్లాడుకోవటం.. కొన్నిసార్లు జోకులు వేసుకోవటం కనిపిస్తుంది. విధానాల పరంగా విరుచుకుపడే నేతలు.. వ్యక్తిగతంగా మాత్రం దాదాపుగా ఫ్రెండ్లీగా ఉండటం మామూలే. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితులు జగన్ పార్టీ ఫైర్ బ్రాండ్ విషయంలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఏపీ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాతో తెలుగు తమ్ముళ్లు మాట్లాడేందుకు సైతం జంకుతున్నారు. ఆమెతో ఏం మాట్లాడినా.. అది అధినేతకు మరోలా చేరితే మొదటికే మోసం వస్తుందన్న భయం వారిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ ఈ మధ్యన విజయవాడలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు.
గన్నవరం కోర్టుకు హాజరయ్యేందుకు ఆర్కే రోజా విజయవాడకు వచ్చారు. తిరిగి వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి గన్నవరం ఎమ్మెల్యే.. టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ కూడా చేరుకున్నారు. తన దగ్గర్లోనే ఆర్కే రోజా ఉండటాన్ని గుర్తించి.. ఆమెకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేశారట. అయితే.. ఇలాంటివేమీ పట్టని రోజా మాత్రం వంశీ దగ్గరకు వెళ్లారట. ఆమె తమ వద్దకు వచ్చే విషయాన్ని ఎమ్మెల్యే వంశీకి అనుచరులు చెప్పటం.. ఆయనేమో రోజాను గమనించనట్లుగా పక్కకు వెళ్లిపోయారట. ఈ విషయాన్ని గ్రహించిన రోజా వంశీని కలవకుండా ఆగిపోయారట.
విమాన ప్రయాణంలో భాగంగా బోర్డింగ్ పూర్తి అయ్యాక.. ఫ్లైట్లోకి వెళ్లిన తర్వాత వంశీని రోజా పలుకరించారట. ఏంటి వంశీగారు.. తప్పించుకు తిరుగుతున్నారు? అని ప్రశ్నించారట. దీనికి వంశీ బదులిస్తూ.. అలాంటిదేమీ లేదు మేడమ్.. అనుచరులు ఉన్నారు కదా.. వారితో మాట్లాడుతున్నా అని బదులిచ్చారట. దీంతో.. ఆమె తన సీటుకు వెళ్లిపోయారు. అసలు కథేమిటంటే.. ఆర్కే రోజాతో ఏం మాట్లాడినా అధినేతకు ఆ సమాచారం మరోలా చేరితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో తెలుగు తమ్ముళ్లు ఇలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి జగన్ పార్టీ ఫైర్ బ్రాండ్ విడిగా కూడా తమ్ముళ్లకు టెన్షన్ తెప్పిస్తున్నారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/