అనునిత్యం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకునే తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఆయనకు ఒక లేఖ రాయడం ఆసక్తిదాయకంగా ఉంది. ఇది కూడా జగన్ ముందుకు వెళ్తున్న అంశం గురించే. మామూలుగా అయితే విమర్శించే వాళ్లు, ఇప్పుడు లేఖ రాశారు. బహుశా ఈ లేఖ పట్ల సానుకూలంగా స్పందించకపోతే జగన్ మీద మళ్లీ టీడీపీ విమర్శలను మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేతలు లేఖ రాశారు. ఆ పార్టీ నేతలు రామ్మోహన్ నాయుడు, కొనకళ్ల నారాయణ, పల్లా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, నిమ్మల కిష్టప్పలు ఉమ్మడిగా జగన్ కు ఒక లేఖ రాశారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని అందులో కోరారు.
ఎందుకంటే.. ప్రస్తుతం కరోనా వైరస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యం లో.. స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు అంటే ప్రజలంతా ఓటు వేయడానికి వస్తారు, కాబట్టి.. ఆ సమయం లో కరోనా ప్రబలే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఇలాంటి లేఖలు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు భయపడుతోందనే సంకేతాలను ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికలకు భయపడే తెలుగుదేశం పార్టీ ఇలా వాయిదాల అంశాన్ని తెర మీదకు తెస్తోందని, ఏదో ఒక రీజన్ చెప్పి ఎన్నికలను వాయిదా వేయించాలని చూస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ ను ఆటంకంగా చూపి తెలుగుదేశం ఇప్పుడు అలాంటి రాజకీయం చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికలంటే తమకు భయం లేదని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.