ఏపీ టీడీపీ ఎంపీల పరిస్థితి దయనీయంగా ఉంది. బట్టలు ఊడదీసి మరీ బజార్లో నిలబెట్టినట్లుగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారిపై విరుచుకుపడటం తెలిసిందే. ఎంపీలుగా ఎన్నికైన వారు వారి.. వారి బిజినెస్‌లు చూసుకోవటంలో బిజీగా ఉన్నారని.. తెలంగాణ అధికారపక్షం ఎంపీల మాదిరి పోరాడటం లేదని విమర్శించటమే కాదు.. ఆత్మాభిమానం.. పౌరుషం లేదా అని తీవ్రస్థాయిలో మండిపడటం తెలిసిందే.
ఇప్పటివరకూ ఎవరూ అనని మాటలు అన్న పవన్‌పై వారుతీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీల గెలుపు కోసం తాను తిరిగిన విషయాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. ఏపీకి అందాల్సిన ప్రత్యేక హోదా మీద ఎందుకు పోరాటం చేయటం లేదని.. మోడీని సర్కారుపై ఎందుకు ఆందోళన చేయటం లేదని ప్రశ్నించిన నేపథ్యంలో పవన్‌పై విమర్శలు చేసేందుకు కత్తులు నూరుకుంటున్నారు.
పవన్ వ్యాఖ్యలపై తమ రియాక్షన్ ఇచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పవన్ విమర్శలపై హర్ట్ అయిన టీడీపీ ఎంపీలు పవన్‌పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారే కానీ.. ఓపెన్‌గా మాత్రం ఎవరూ నోరు విప్పని పరిస్థితి. అధినేత అనుమతి లేకుండా పవన్‌పై విమర్శలు చేస్తే.. చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందన్న విషయంపై స్పష్టత లేకనే.. ఇలా మీడియాకు లీకులిచ్చి సంతృప్తి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తమను ఎన్నుకున్న ప్రజల కోసం పోరాటం చేయలేని వారు.. తమను తిట్టినా కూడా స్పందించలేని దుస్థితి తమ్ముళ్లకు తప్ప మరే రాజకీయ నేతకు ఉండదేమో.