తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత గత ఐదేళ్ల పాలన వ్యవహారాలపై అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు - లోకేష్ ల ఆధ్వర్యంలో భారీగా అవినీతి జరిగింది… కాంట్రాక్టర్లకు బాగా దోచి పెట్టారు.. అనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు ఫైల్స్ ను దులిపింది. అందులో భాగంగా భారీ అవినీతి బయటపడుతూ ఉందనే మాట వినిపిస్తోంది.
ఫైబర్ గ్రిడ్స్ - పోలవరం వంటి వ్యవహారాలను ఇంకా పూర్తిగా కదిలిస్తే భారీగా అవినీతి బయటపడే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఆ సంగతలా ఉంటే.. నేతల వ్యక్తిగత అవినీతిపై కూడా భారీ ఆరోపణలు వస్తున్నాయి.
అలాంటి వ్యవహారంలో బాగా చిక్కుకున్నారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్. ఆయన కూతురు - కొడుకు ఎంతో మందిని బెదిరించి - అధికారాన్ని అడ్డం పెట్టుకుని వసూళ్లు చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం అధికారం కోల్పోగానే అందుకు సంబంధించి అనేక మంది బాధితులు పోలిస్ స్టేషన్లకు ఎక్కారు. తమకు న్యాయం జరగాలంటూ.. కోడెల కుటుంబం తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిందంటూ వారు వాపోతూ ఉన్నారు.
అందుకు సంబంధించి ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. వాటికి సంబంధించి చట్టపరమైన చర్యలు సాగుతూ ఉన్నాయి. ఈ కేసులతో కోడెల కుటుంబీకుల మీదు ఉచ్చు గట్టిగా బిగుసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మరకలు తెలుగుదేశం పార్టీ మీద కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోడెల ఫ్యామిలీకి సపోర్ట్ గా ఎవరూ మాట్లాడటం లేదు కూడా! అనేక అంశాల గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు కోడెల కుటుంబంపై కేసుల వ్యవహారం గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ మరో రకంగా స్పందించబోతోందట. కోడెల కుటుంబాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన కూడా మొదలైందట.
ఈ మేరకు లోకేష్ బాబుకు కొంతమంది సలహా ఇచ్చారని సమాచారం. దానిపై మరికొంత చర్చించి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారట. కోడెల కుటుంబాన్ని అలా టీడీపీ నుంచి బయటకు పంపి.. తమపై మరకలు పడకుండా చూసుకోవాలని అనుకుంటున్నారట. అయినా ఇప్పుడు సస్పెండ్ చేసేస్తే టీడీపీ పై కోడెల అవినీతి మరకలు పడవని అనుకోవడం అమాయకత్వమే అనే వాదనా వినిపిస్తుండటం గమనార్హం!