ఒక హెలిక్యాప్టర్ ఇప్పిస్తే సీఎం జగన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పానంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే , బీఏసీ సభ్యుడైన అచ్చెన్నాయుడు మీడియాతో అన్నారు. ఎవ్వరికి తెలుపకుండా సోమవారం అసెంబ్లీ సమావేశం పెట్టి 11.13కు తనకు ఫోన్ చేసి బీఏసీ సమావేశానికి రమ్మన్నారని.. శ్రీకాకుళం లో ఉన్న తాను అసెంబ్లీ కి ఎలా రావాలని.. అందుకే హెలిక్యాప్టర్ ఇప్పించాలని అన్నానని.. దెబ్బకు ఫోన్ కట్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ కు అసెంబ్లీని నడిపే తీరు తెలియదంటూ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.వైసీపీ ప్రభుత్వం సభా నియమాలకు విరుద్ధంగా అసెంబ్లీ నిర్వహిస్తోందని.. గురువారం తర్వాత హడావుడి గా సోమవారం సభను ఎందుకు పెట్టారని అచ్చెన్న ప్రశ్నించారు.
దేశంలో 22 రాష్ట్రాల్లో మండలి లేదంటున్న జగన్.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 3 రాజధానులు లేవన్న విషయం తెలియదా అని అచ్చెన్న ప్రశ్నించారు.
హైకోర్టు చెప్పినా జగన్ వినిపించుకోవడం లేదని.. లోపభూయిస్టమైన బిల్లును కేంద్రం అంగీకరింబోదని.. అచ్చెన్న స్పష్టం చేశారు.