ఏపీ కి మూడు రాజధానులు ఉండవచ్చంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను ఒకవైపు తెలుగుదేశం పార్టీ తప్పు పడుతూ ఉండగా, మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఆ ప్రకటన ను సమర్థించారు. అమరావతి ప్రాంతమే రాజధాని ఉండాలని.. అక్కడ నుంచినే అంతా సాగాలని, అమరావతి ఒక అంతర్జాతీయ నగరం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న సంగతి తెలిసిందే. అమరావతి గురించి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపారు. ఆ గ్రాఫిక్స్ నిజం అన్నట్టుగా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
అయితే జగన్ పూర్తిగా చంద్రబాబు నాయుడి లెక్కలకు భిన్నంగా వెళ్తూ ఉన్నారు. వికేంద్రీకరణ మంత్రం వేస్తున్నారు జగన్. ఇలాంటి నేపథ్యం లో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తుతూ ఉంది.
అయితే ఆ పార్టీలో ఈ విషయంలో యూనిటీ కనిపించడం లేదు. సీఎం ప్రకటనను స్వాగతించారు ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
'' విశాఖపట్నం ని పరిపాలనా రాజధాని గా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం.
రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో రాజధాని గా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రం గా కూడా మారితే విశ్వ నగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.'' అంటూ గంటా ట్వీట్ చేశారు. మొత్తానికి మూడు రాజధానుల అంశం విషయంలో తెలుగుదేశం పార్టీలోనే ఏకాభిప్రాయం ఉన్నట్టుగా లేదు.