చంద్రబాబు సమీక్ష.. ఝళక్‌ ఇచ్చిన ఎమ్మెల్యేలు

Update: 2020-03-27 08:10 GMT
కరోనా వైరస్‌ మహమ్మారిపై రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వానికి సహకరించాలని.. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులను కూడా భాగస్వాములను చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ నివారణలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజల పట్ల పూర్తి అంకితభావంతో భాగస్వామి అవ్వాలని సూచించారు. ప్రజలను కాపాడటంలో ముందుండి పోరాడే యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులకు చెప్పారు. ఈ క్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల సభ్యుల సేవలను చంద్రబాబు అభినందించి వారికి సహకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అయితే ఈ సమావేశానికి ఊహించని రీతిలో చంద్రబాబుకు షాక్‌ తగిలిందని సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఝళక్‌ ఇచ్చారంట. ఈ కార్యక్రమానికి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారంట. సార్వత్రిక ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు పార్టీకి దూరంగా ఉండగా మిగతా ఎమ్మెల్యేలంతా పార్టీలోనే ఉన్నా చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే చంద్రబాబుపై నమ్మకం లేక కొంతమంది రాకపోగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో హాజరుకాలేకపోయారంట.
Tags:    

Similar News