బొండా ఉమా ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్న బొండా పార్టీ మారతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే 2014లో టీడీపీ తరుపున విజయవాడ సెంట్రల్ నుంచి బంపర్ మెజారిటీతో గెలిచిన ఉమా మొన్న ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి కేవలం 25 ఓట్ల తేడాతో మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. అటు పార్టీ కూడా రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో బొండా సైలెంట్ అయిపోయాడు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన బొండా ఐదేళ్ల పాటు ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచారు.
తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీ మారుతారని వార్తలు వచ్చాయి. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళిన ఆయన రాగానే వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం వచ్చింది. దానికి తగ్గట్టుగా ఆయన పార్టీ మారుతున్నట్లు పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. పార్టీ మారితే బొండాకు విజయవాడ తూర్పు నియోజకవర్గ పగ్గాలు ఇస్తారని కూడా పుకార్లు - షికార్లు చేశాయి. బొండా మొన్న ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చారు. పార్టీ మారుతారని ప్రచారం జరగడంతో చంద్రబాబు - ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నని వెళ్ళి ఉమాతో మాట్లాడాలని చెప్పారు.
ఈ క్రమంలోనే శనివారం బుద్దా - ఉమాతో భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై చర్చించారు. అలాగే టీడీపీ కాపులకు ఎలాంటి గుర్తింపు ఇచ్చిందో ఉమాకి వివరించారని - వైసీపీ రెండు నెలల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్తే భవిష్యత్ ఉండదని చెప్పారని తెలుస్తోంది.
ఇక సమావేశం ముగిశాక మీడియా ముందుకు వచ్చి ఉమా పార్టీ మారే ప్రసక్తే లేదని - ఆయన టీడీపీలోనే ఉంటున్నారని బుద్దా క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే తాను నగర పార్టీ అధ్యక్షుడిగా తప్పుకుంటానని... ఆ పదవి కూడా స్వీకరించాలని బొండాను కోరానని కూడా చెప్పారు.
ఇక ఇదే విషయమై ఉమా మాట్లాడుతూ.. తాను ఇప్పుడే ఏం మాట్లాడనని, చంద్రబాబుని కలిసిన అనంతరం వివరాలు చెబుతానని చెప్పారు. దీంతో ఆయన పార్టీలో ఉంటాడా? వెళతాడా? అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో ఇంకా పెరిగాయి. ఇదిలా ఉంటే సోమవారం ఉమా చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బాబుతో ఏం మాట్లాడతారు.? చివరికి ఏ చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బొండా టీడీపీలో ఉంటారో? వీడుతారో సోమవారం క్లారిటీ రానుంది.