వివేకా హత్య : సిట్ ముందుకి ఎమ్మెల్సీ బిటెక్ రవి!

Update: 2019-12-05 10:42 GMT
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది. గత  రెండు రోజుల నుంచి విచారణలో స్పీడ్ పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం... వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్‌ తో పాటు.. ఇంట్లో పని చేసేవారని రహస్యంగా ప్రశ్నించింది. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో పాటు మరికొంత మంది నేతలను 2019 - డిసెంబర్ 05వ తేదీ గురువారం విచారించనున్నారు. విచారణకు హాజరుకావాలని బీటెక్ రవికి ఇప్పటికే నోటీసులు జారీచేశారు. విచారణలో ఆయన చెప్పే సమాధానాలను బట్టి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం తరువాత  బీటెక్ రవి - సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ఇంట్లో పని చేసిన వంట మనుషులు - వాచ్‌ మెన్ - డ్రైవర్లను సిట్ ప్రశ్నించింది. వివేకానంద హత్య జరిగిన రోజు... ఆయన ఎన్ని గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు ఆయనతో ఎవరెరున్నారు. అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. హత్య జరిగిన రోజు రాత్రి వివేకానంద ఇంటికి వచ్చిన సమయంలో ఎవరెవరున్నారు. ఇంట్లో ఒక్కడే నిద్రపోయాడా.. ఎవరితోనైనా ఫోన్ మాట్లాడాడా... అనే వియంపైనా పోలీసులు దృష్టిపెట్టారు.

ఇప్పటికే వాచ్‌ మెన్ రంగయ్యకు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయినా కూడా మరోసారి అతన్ని పిలిచి విచారించారు. ఈ మూడు రోజుల్లో 12మందిని ప్రశ్నించిన పోలీసులు... పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మరోవైపు... వివేకా హత్య కేసులో అనుమానితులు చెప్పిన వివరాలను బట్టి మిగతా వారికి నోటీసులు జారీచేస్తున్నారు. వివేకానంద హత్య కేసు విచారణ మధ్యలో వేగం తగ్గింది. దీనితో సొంత బాబాయ్ ని చంపిన నిందుతులనే పట్టుకోలేదు అంటు  విమర్శలు చేసారు. దీనితో ఎంక్వైరీ త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో... సిట్ తన దర్యాప్తు స్పీడ్  పెంచింది. చూడాలి మరి ఈ హత్య కేసులో సిట్ ఎవరిని దోషులుగా తెలుస్తుందో
Tags:    

Similar News