ఒక ఎంపీ సీటు పరిధిలో ఏడెనిమిది వేల ఓట్ల మెజారిటీలు ఏ పాటివో అర్థం చేసుకోవడం కష్టం ఏమీ కాదు. కొన్ని లక్షల ఓట్లు ఉండే ఎంపీ సీట్లలో గెలుపు అంటే లక్షల ఓట్ల మెజారిటీని సాధించడం అని అంతా అనుకుంటున్నారు. కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో నెగ్గే వాళ్లు చాలా మంది ఉంటారు.
అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరువు నిలిపిన మూడు ఎంపీ సీట్లలోనూ దక్కింది అత్యంత స్వల్ప మెజారిటీనే కావడం గమనార్హం. ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గానూ తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ సీట్లను నెగ్గింది. వాటిల్లో కూడా కొన్ని రౌండ్స్ లో తెలుగుదేశం పార్టీ బాగా వెనుకపడిపోయింది కూడా. అయినా చివరకు అయితే గెలవగలిగింది.
శ్రీకాకుళం - విజయవాడ - గుంటూరు.. ఈ మూడు ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు నెగ్గారు. మూడు చోట్లా సిట్టింగులే నెగ్గారు. అయితే వీరికి దక్కిన మెజారిటీలు మాత్రం అత్యంత స్వల్పం.
శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడుకు ఎనిమిది వేల చిల్లర ఓట్ల మెజారిటీ దక్కింది. విజయవాడలో కేశినేని నానికి కూడా అదే స్థాయి ఓట్ల మెజారిటీ దక్కింది. గుంటూరులో గల్లా జయదేవ్ కు మరీ ఐదు వేల ఓట్ల స్థాయి మెజారిటీ దక్కింది!
ఏదో త్రుటిలో - లక్కీగా ఈ ముగ్గురూ నెగ్గినట్టుగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. కనీసం ఒక్కో అసెంబ్లీ సీట్లో దక్కే స్థాయి మెజారిటీలతో వీరు బయటపడ్డారు. వీరి ప్రత్యర్థులు గట్టి పోటీని ఇచ్చారు.