మహేష్ రాడు.. పవన్ అర్థం కాడు!

Update: 2017-12-09 16:58 GMT
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన బావమరిది మహేష్ బాబుల విషయమై రాజకీయ కోణంలో స్పందించాడు. మహేష్ బాబు రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశాడు. మహేష్ కు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని ఆయనన్నాడు.

మూడు రోజుల రాజకీయ పర్యటనతో కాక రేపిన పవన్ కళ్యాణ్ విషయంలోనూ జయదేవ్ స్పందించాడు. తమ పార్టీ మీద పవన్ విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. పవన్‌ కళ్యాణ్‌ను టీడీపీ ఇప్పటికీ మిత్రుడిగానే భావిస్తోందని జయదేవ్ తెలిపాడు. రానున్న రోజుల్లో కూడా ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని ఆయన ఆకాంక్షించాడు.

ప్రజారాజ్యంలో పని చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ను తాను గమనిస్తున్నానని... ఆయన ఆలోచనా విధానం మంచిదని.. పవన్ సమాజ అభివృద్ధి కోసం పరితపిస్తుంటాడని.. ఐతే రాజకీయంగా ఆయన స్టాండ్ ఏంటనేది మాత్రం తనకు అర్థం కావడం లేదని జయదేవ్ చెప్పడం విశేషం. మరోవైపు భారతీయ జనతా పార్టీతో సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అందించే సహకారాన్ని బట్టే ఆ పార్టీతో పొత్తు ఆధారపడి ఉంటుందన్నాడు.
Tags:    

Similar News