తెలుగుదేశం పార్టీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. అధినాయకుడు చంద్రబాబు నుంచి మొదలుపెడితే కీలక నేతలు అంతా కూడా ఎన్నికల హడావుడిలో పడిపోతున్నారు. ఇంకా సగం సమయం ఉండగానే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలి. ఎలా నెగ్గుకురావాలి అన్న ముందస్తు ఆలోచనల్లో ఎవరికి వారు తెగ బిజీగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే కేంద్ర మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడు రామ్మోహన్ నాయుడు చూపు ఇపుడు అసెంబ్లీ సీటు మీద ఉందని అంటున్నారు.
నిజానికి గత ఎన్నికల్లోనే ఆయన అసెంబ్లీ నుంచి పోటీకి పట్టుబట్టారని టాక్ అయితే వచ్చింది. చంద్రబాబు నచ్చచెప్పిన మీదట ఆయన ఎంపీగా రెండవసారి పోటీకి దిగారని అంటారు. మరో వైపు చూస్తే బాబాయ్ అచ్చెన్నాయుడు ఎటూ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు కాబట్టి బాబు బ్యాలన్స్ చేస్తూ ఇద్దరికీ అలా సీట్లు పంచేశారు.
అయితే ఈసారి మాత్రం రామ్మోహన్ అసలు ఊరుకోరు అంటున్నారు. దానికి ఆయన ఇప్పటినుంచే పెంచుతున్న జోరే కారణం. ఈసారి ఎన్నికలకు చాలా ముందుగానే ఆయన తనకంటూ ఒక అసెంబ్లీ సీటు చూసేసుకోవడం, అక్కడ పాగా వేయడానికి స్కెచ్ గీసేయడం కూడా జరిగిపోయాయి. ఇంతకీ రామ్మోహన్ ముచ్చట పడే ఆ సీటు ఏంటి అంటే నరసన్నపేట. అది ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ సీటు.
అక్కడ నుంచి ఇప్పటికి అయిదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు జెండా ఎగరేసిన ఘనత క్రిష్ణదాస్ ది. ఆయనకు ముందు ధర్మాన ప్రసాదరావు అక్కడ నుంచే పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యే అయ్యారు. అంతలా ధర్మాన ఫ్యామిలీకి అంకితం అయిన ఆ సీటు నుంచి పోటీకి రామ్మోహన్ ఎందుకు ఉత్సహాం చూపిస్తున్నారు అన్నది అర్ధం కావడంలేదుట. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ వేవ్ లో అక్కడ నుంచి భగ్గు లక్ష్మణరావు గెలిచారు.
వచ్చే ఎన్నికల్లో కూడా పోటీకి ఆయన తయరుగా ఉన్నారు. మరి సడెన్ గా రామ్మోహన్ అసెంబ్లీ రూట్ పట్టడమే కాకుండా తన సీటు మీదకే రావడంతో బగ్గు ఫ్యామిలీ భగ్గుమంటోంది. మరో వైపు శ్రీకాకుళం ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్ధిగా ఎవరుంటారు అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే ఎర్రన్నాయుడు కుమార్తె, రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని తెచ్చి అక్కడ ఎంపెగా నిలబెడతారు అంటున్నారు.
ఆమె అత్తింటికి వెళ్ళిపోయి అక్కడ ఎమ్మెల్యే అయింది. తిరిగి ఆమెను పుట్టింటికి తెచ్చి ఎంపీగా నిలబెడితే జనాలు ఎంతవరకూ ఆదరిస్తారు అన్నది కూడా చర్చగా ఉంటుంది మరి. మరో వైపు ఆమె గెలిచిన తరువాత కూడా రాజమండ్రీలో ఉంటారు అన్న ప్రచారం వైసీపీ చేస్తే అసలుకే ఎసరు అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇదంతా రామ్మోహన్ మార్క్ పాలిటిక్స్ అని అర్ధమవుతోంది. అచ్చెన్నాయుడు టెక్కలి సీటు వదలరు, టీడీపీ గెలిస్తే మంత్రి కూడా ఆయనే మరోసారి అవుతారు.
ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మరో వైపు ఎంపీగా రామ్మోహన్ ప్రతీసారీ లోక్ సభకే పోటీ చేసి గెలిచినా ఢిల్లీలోనే ఉండాలి. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో వెలగాలన్న ఆశ నెరవేరడంలేదనే రామ్మోహన్ ఇలా సొంతంగా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఇక నరసన్నపేటను ఆయన ఎంచుకోవడానికి కారణం ఉందిట. ఈసారి క్రిష్ణదాస్ పోటీ చేయకుండా కొడుకు డాక్టర్ క్రిష్ణ చైతన్యను పోటీకి దింపుతారు అని అంటున్నారు. కొడుకు అయితే పొలిటికల్ గా జూనియర్. దాంతో తాను పక్కాగా గెలిచి జెండా ఎగరేయవచ్చు అన్నదే రామ్మోహన్ ఆలోచన అంటున్నారు. అలాగే తనకూ ఒక అసెంబ్లీ సీటుగా నరసన్నపేటను మార్చుకోవాలని కూడా ఆయన మాస్టర్ ప్లాన్ వేశారనే అంటున్నారు. చూడాలి మరి ఈ ప్లాన్ పారాలీ అంటే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి మరి.