ఊస‌ర‌వెల్లి దేశం!

Update: 2018-08-03 09:33 GMT
తెలుగుదేశం పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను ఎలా భయ‌పెడుతోందో... వారిని ఎలా ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తోందో ఆ పార్టీ లోక్ స‌భ స‌భ్యుడు శివ‌ప్ర‌సాద్ దేశ రాజ‌ధాని వాసుల క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. త‌న చిత్ర‌ - విచిత్ర వేష‌ధార‌ణ‌ల‌తో పిచ్చి చేష్ట‌లు చేసే ఆయ‌న శుక్ర‌వారం నాడు త‌న త‌న‌ది - త‌న పార్టీది ఎలాంటి వేష‌మో తెలియ‌జేశారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో... రాష్ట్రం విడిపోకూడ‌దంటూ కూడా శివ‌ప్ర‌సాద్ ఆ స‌మ‌యంలో ఢిల్లీలో విచిత్ర వేషాలు వేసి ప్ర‌జ‌ల‌కు అస‌హ‌నం తెప్పించారు. ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న మ‌ళ్లీ వేషాలు వేస్తున్నారు.

ఈసారి శివ‌ప్ర‌సాద్ వేసిన మాయ‌ల ప‌కీరు వేషం చూసిన వారు తెలుగుదేశం పార్టీ అస‌లు వేషం ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు భార‌తీయ జ‌న‌తా పార్టీతో అంట‌కాగిన తెలుగుదేశం పార్టీ ఆనాటి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. అటు త‌ర్వాత నాలుగేళ్లు వారితో సంసారం చేసి ఇప్పుడు ప్ర‌త్యేక హోదా సాకుతో వారికి దూర‌మైంది. ఇవ‌న్నీ తెలుగుదేశం ఆడుతున్న నాట‌కాలలేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు తెలియ‌డంతో లోక్ స‌భ‌లో మ‌ళ్లీ కొత్త నాట‌కాలకు తెర తీస్తోంది. అందులో భాగంగా ఎంపి శివ‌ప్ర‌సాద్ చేత రోజుకో వేషం వేయిస్తున్నారు చంద్ర‌బాబు నాయుడు. య‌మ కింక‌రుని వేషంతో శివ‌ప్ర‌సాద్ పార్ల‌మెంట్ ముందు క‌నిపించిన రోజున తెలుగుదేశం పాల‌కులు ఆంధ్ర‌ప్ర‌దేశ్  ప్ర‌జ‌ల‌ను ఇలాగే య‌మ‌కింక‌రుల్లా వేధిస్తున్నార‌ని అనుకున్నారు. అంత‌కు ముందు బుడబుక్క‌ల వాని వేషం వేసుకుంటే వీళ్ల‌కి ఇదే స‌రైన వేషం అని తీర్మానించుకున్నారు. మొన్న‌టికి మొన్న స‌త్య‌సాయి బాబా వేషం వేస్తే ఆయ‌న భ‌క్తులు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. తాజాగా మాయ‌ల ప‌కీరు వేషంలో క‌నిపించ‌గానే ప‌చ్చ పార్టీ వారి అస‌లు నైజం... అస‌లు వేషం బ‌య‌ట‌ప‌డింద‌ని ఢిల్లీ వాసులు అనుకుంటున్నారు.


Tags:    

Similar News