చంద్రబాబుకు షాకిచ్చిన సొంత జిల్లా ఎంపీ

Update: 2017-04-14 07:21 GMT
కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీలకు అన్యాయం చేస్తోందని.. మోసగిస్తోందని అన్నారు.
    
ముఖ్యంగా మంత్రి పదవుల విషయంలోనూ ఎస్సీలకు అన్యాయం జరిగిందని శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం తమకు ఐదు కేబినెట్‌ పదవులు ఇవాల్సివుండగా రెండే మంత్రి పదవులిచ్చి వదిలేశారని వాపోయారు. ఎస్సీ సబ్‌ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మాల మాదిగలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మాటేంటని ప్రశ్నించారు.
    
కాగా చంద్రబాబు ఇటీవల చేపట్టిన కేబినెట్ విస్తరణ ఇప్పటికే పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసిన సంగతి తెలిసిందే. సొంత జిల్లా చిత్తూరుకు చెందిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తొలగించడంతో ఆయన మండిపడుతున్న సంగతీ తెలిసిందే. ఇప్పుడు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా ఆగ్రహిస్తుండడంతో చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బే పడడం ఖాయమని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News