టీడీపీ జాతీయాధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ జనరల్ సెక్రటరీ - రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని...విజయసాయిరెడ్డి అనడంపై కొంతమంది విమర్శలు గుప్పించారు. అయితే, హోదా కోసం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేసే నిరసనల వేషాలు చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఆ తరహా కామెంట్స్ చేయడంలో తప్పు లేదనిపిస్తుంది. శుక్రవారం నాడు చిత్తూరు నుంచి ఎంపికైన టీడీపీ ఎంపీ శివ ప్రసాద్....హిజ్రా వేషధారణలో వచ్చి పార్లమెంటు బయట నానా రచ్చ చేశారు. ప్రధాని మోదీని.....మోదీ బావా...అంటూ సంబోధిస్తూ....జుగుప్స కలిగించే రీతిలో వ్యవహరించారు. అంతటితో ఆగకుండా....మహిళ అయిన సోనియా గాంధీ వైపు చూస్తూ అసభ్యకరమైన సైగలు చేసి చికాకు తెప్పించారు. మీడియా దృష్టిని ఆకర్షించే క్రమంలో ....శివప్రసాద్ ఓ జోకర్ లా మారిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, కొంతకాలంగా పార్లమెంటు దగ్గర....రకరకాల గెటప్స్ మారుస్తున్న శివ ప్రసాద్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించే క్రమంలో ....శివప్రసాద్ ఓ జోకర్ లా మారిపోయారని నెటిజన్లు విమర్శించారు. హిట్లర్ - అన్నమాచార్యులు - సత్య సాయిబాబా - మత్స్య కారుడు - సత్య హరిశ్చంద్ర - కోయదొర - రైతు - చర్చి ఫాదర్ - ఎన్టీఆర్ - పోతురాజు - శ్రీకృష్ణుడు...ఇలా పలు రకాల వేషధారణలతో పార్లమెంటు వెలుపల శివ ప్రసాద్ వినూత్న నిరసనలు చేపట్టడం వల్ల ఒరిగిందేమీ లేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, మీడియా దృష్టిని ఆకర్షించడం....తద్వారా హోదా గురించి జాతీయ మీడియా దృష్టిలో పడడం వంటి ఆలోచన మంచిదేనని...కానీ ఆ క్రమంలో కేవలం వేషాలకే పరిమితమై సీరియస్ అంశాన్ని సిల్లీ ఇష్యూ చేయకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా టీడీపీ ఎంపీలు వేషాలు మాని...చిత్తశుద్ధితో హోదా కోసం ప్రయత్నించాలని నెటిజన్లు కోరుతున్నారు.