ఆంధ్రోళ్ల ప్ర‌యోజ‌నాల‌కు బాబు స‌మాధి

Update: 2017-04-12 05:13 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. తెలుగు ప్ర‌జ‌ల్ని మోసం చేసిన రాజ‌కీయ నాయ‌కులు ఉన్నారే కానీ.. తెలుగు ప్ర‌జ‌లు మోసం చేసిన నాయ‌కుల్లేర‌ని. రాజ్య‌స‌భ‌లో మంగ‌ళ‌వారం చోటు చేసుకున్న ప‌రిణామాల్ని చూస్తే.. ఈ మాట చ‌ప్పున గుర్తుకు రాక త‌ప్ప‌దు. రెండుసార్లు కాంగ్రెస్‌ కు అధికారం క‌ట్ట‌బెట్టిన పాపానికి.. ఆంధ్రాను అవ‌స్థ‌ల పాలు చేస్తూ.. రాష్ట్రాన్ని రెండు ముక్క‌లు చేసేశారు. విభ‌జ‌న బాధ‌తో.. కాంగ్రెస్ మీద క‌సితో చంద్ర‌బాబుకు ప‌వ‌ర్ ఇవ్వ‌టం ఆంధ్రోళ్లు చేసిన అతి పెద్ద త‌ప్ప‌న్న విష‌యం తాజాగా రుజువైంది. గ‌తంలో ప‌దేళ్ల అధికారాన్ని.. 2014లో ఐదేళ్ల అధికారాన్ని చంద్ర‌బాబుకు ఇచ్చిన పాపానికి ఆంధ్రోళ్ల‌కు జ‌ర‌గాల్సిన ద్రోహం బాగానే జ‌రిగిపోయింది.

త‌ను సీఎంగా మొద‌టి తొమ్మిదిన్న‌రేళ్ల పాల‌న‌లో అభివృద్ధి అంతా హైద‌రాబాద్‌ లో పోగేసిన చంద్ర‌బాబు.. ఏపీలో మ‌రే ప్రాంతాన్ని భాగ్య‌న‌గ‌రిని ప‌ట్టించుకున్న‌ట్లుగా ప‌ట్టించుకున్న‌ది లేదు.

బాబు ప‌వ‌ర్ లోకి రాక‌ముందే.. డెవ‌ల‌ప్ అయిన విశాఖ‌ను వ‌దిలేసి.. ఫోక‌స్ అంతా హైద‌రాబాద్ మీద పెట్టిన‌ కార‌ణంగా.. భాగ్య‌న‌గ‌రికి భాగ్యంగా మారితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అదో శిక్ష అయ్యింద‌న్న విష‌యం విభ‌జ‌న సంద‌ర్భంగా తేలింది. విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీ ఫ్యూచ‌ర్ కోసం ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ రాజ్య‌స‌భ‌లో హామీ ఇవ్వ‌టం.. దానికి వెంక‌య్య కౌంట‌ర్ గా తాము ప‌వ‌ర్ లోకి రాగానే ప‌దేళ్లు ఇచ్చేస్తామ‌న్న బ‌డాయి మాట‌లు చెప్ప‌టం తెలిసిందే.

మోడీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎలాంటి అన్యాయం జ‌రిగిందో తెలిసిందే. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి చాలా అన్యాయం జ‌రిగింద‌ని.. త‌న‌ను చాలా వేద‌న‌కు గురి చేసింద‌ని.. చెట్ల కింద పాల‌న చేసుకునే ప‌రిస్థితికి వ‌చ్చామంటూ ప‌లు సంద‌ర్భంగా ఆవేద‌నా భ‌రిత‌మైన మాట‌లు చెప్పిన బాబు.. అవ‌న్నీ వ‌ల్లె వేసిన డైలాగులే త‌ప్పించి.. మ‌న‌సు మాట‌లు కావని స్ప‌ష్ట‌మైంది.

త‌న‌కు ఓట్లు వేసిన కోట్లాది ఆంధ్రోళ్ల కంటే.. ప్ర‌ధాని మోడీనే ఎక్కువ‌న్న విష‌యాన్ని తాజాగా ఆయ‌న త‌న చేత‌ల‌తో రుజువు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే.. ఆ రాష్ట్రం దూసుకెళ్ల‌టం.. అభివృద్ధి విష‌యంలో గుజ‌రాత్‌.. త‌మిళ‌నాడు.. క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు జ‌రిగే న‌ష్టంతో రాజ‌కీయంగా త‌మ‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌న్న భావ‌న‌.. ఏపీకి ఇస్తామ‌న్న హోదా మాట మీద వెన‌క్కి మ‌ళ్లేలా చేశాయి. ఏపీకి జ‌రిగిన విభ‌జ‌న అన్యాయానికి బ‌దులు తీర్చుకుంటామ‌ని.. అంత‌వ‌ర‌కూ నిద్ర‌పోనంటూ చాలానే క‌బుర్లు చెప్పిన చంద్ర‌బాబు.. త‌న‌కు ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు అస్స‌లు అక్క‌ర్లేద‌న్న విష‌యాన్ని త‌న చ‌ర్య‌తో తేల్చి చెప్పారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగితే.. దీనికి ఏపీ టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు గైర్హాజ‌రు అయ్యారు. అంతేనా.. స‌భ‌లో ఉన్న కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు నోరు మెద‌ప‌కుండా.. మౌనంగా ఉండిపోయారు. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం సొంత మామ‌కు వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడ‌ని ట్రాక్ రికార్డు ఉన్న చంద్ర‌బాబు.. తాజాగా త‌న రాజ‌కీయ ల‌బ్థి కోసం.. కోట్లాది మంది ఆంధ్రుల్ని వెన్నుపోటు పొడిచేందుకు అస్స‌లు మొహ‌మాట ప‌డ‌లేదు. విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఏపీకి ఇచ్చిన హోదా హామీని అమ‌లు చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కోరినా.. మోడీ స‌ర్కారు స‌సేమిరా అన‌టం ఒక ఎత్తు అయితే.. ఆంద్రోళ్ల ప్ర‌యోజ‌నాల్ని కాపాడ‌ట‌మే త‌న ల‌క్ష్యంగా నిత్యం చెప్పుకునే చంద్ర‌బాబు.. మాట వ‌ర‌స‌కు కూడా హోదా మీద జ‌రిగిన చ‌ర్చ‌లో త‌న స‌భ్యుల్ని పాల్గొనేలా చేయ‌లేక‌పోయారు.
 
ప్ర‌త్యేక హోదా మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. కాంగ్రెస్‌.. వామ‌ప‌క్ష నేత‌లు బ‌లంగా వాదించిన‌ప్ప‌టికీ.. కేంద్రం త‌న ముకుంప‌ట్టు వీడ‌క‌పోగా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చింది. ఏపీతో స‌హా మ‌రే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చే ప్ర‌తిపాద‌న లేద‌ని కేంద్రం పున‌రుద్ఘాటించటం గ‌మ‌నార్హం. హోదా అన్న‌ది ఏపీకి ఇచ్చేది లేదంటూ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేసిన మోడీ ప‌రివారం బ‌రితెగింపు మాట‌ల్ని చూసి కూడా మౌనంగా ఉన్న ఏపీ టీడీపీ త‌మ్ముళ్ల తీరు చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. బాబుకు ప‌వ‌ర్ ఇచ్చినందుకు ప్ర‌తి ఆంధ్రోడు త‌న చెప్పుతో తాను కొట్టుకోవాల్సిందే. త‌మ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎంపీలు సైతం ఆంధ్రోళ్ల ప్ర‌యోజ‌నాల కోసం గ‌ళం విప్పితే.. ఆంధ్రోళ్ల కోస‌మే తాము ఉంద‌ని మాట‌లు చెప్పే బాబు ఎంపీలు.. క‌నీసం హోదా చ‌ర్చ‌కు స‌భ‌కు రాకుండా మొహం చాటేసిన వైనం చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే..  ఆంధ్రోళ్ల ప్ర‌యోజ‌నాల్ని స‌మాధి క‌ట్టే బాబుకు చేజేతులారా అధికారాన్ని క‌ట్ట‌బెట్టినందుకు కోట్లాది మంది ప్ర‌జ‌లు మ‌రోసారి ప‌శ్చాతాపం చెందాల్సిందే. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News