ఏపీకి ప్రత్యేక హోదా - విభజన హామీల అమలు కోసం కేంద్రంపై వత్తిడి తెచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులలో తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా హామీని అమలు చేయడం సాధ్యపడదని ప్రభుత్వం తేల్చిచెబుతుండడంతో .. ‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ’ పేరుతో కేంద్రం ఇవ్వజూపుతున్న అదనపు ఆర్థిక సహాయాన్ని సాధ్యమైనంత ఎక్కువగా రాబట్టుకొనే ప్రయత్నం చేయాలన్న పార్లమెంటరీ పార్టీ నాయకుని వైఖరిపై మిగతా ఎంపీలు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలకు భావోద్వేగ అంశంగా మారిన వాస్తవాన్ని విస్మరించి కేంద్రంతో రాజీపడితే రాజకీయంగా తీవ్రంగా నష్టపోక తప్పదని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇక కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ హోదా ఇవ్వదు కాబట్టి వీలైనంత భారీగా ప్యాకేజీ సాధించుకోవాలని అంటున్నారు. ఈ భిన్నాభిప్రాయాలతో టీడీపీ ఎంపీలు నిలువునా చీలిపోయారు. నిత్యం వాదులాటలు.. ఏకాభిప్రాయం లేని చర్చలతో గడుపుతున్నారు. దీంతో ఆ పార్టీలోనే క్లారిటీ లేదన్న విషయం స్ప్రెడ్ అవుతోంది.
ప్యాకేజీ పేరుతో మొత్తం అయిదేళ్లలో ఇస్తామంటున్న పదివేల కోట్ల రూపాయల కోసం కక్కుర్తిపడితే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లవుతుందని తొలిసారి ఎన్నికైన యువ ఎంపీలు వాదిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత స్వయంగా విభజన హామీలన్నింటినీ సాధించుకోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలిచ్చినా పార్లమెంటరీ పార్టీ నేత మాత్రం ప్యాకేజీకి సై అంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే సీనియరు లీడర్లు కొందరు మాత్రం.. ప్రత్యేక హోదాతో లభించే మొత్తానికి సమానంగా నిధులను మరో పేరుతో ఇస్తామంటే ఎందుకు వద్దనాలన్న వాదనను వినిపిస్తున్నారు. టిక్కెట్ కొన్న విమానంలో సీట్లు నిండిపోతే మరో విమానంలో పంపుతామంటే వచ్చే నష్టమేమిటి అని వాదిస్తున్నారు.
ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు టీడీపీ పరువును బజారుకీడుస్తున్నాయి. ఒకరిద్దరు టీడీపీ ఎంపీలు ఇటీవల జరిగిన టిడిపి పార్లమెంట్ సభ్యుల ఇష్టాగోష్టి సమావేశాలలో నేరుగా పార్లమెంటరీ పార్టీ నాయకుడు - కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరిని దీనిపై నిలదీసినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చి ఎంపీల నోళ్లు మూయించకపోతే ఇబ్బందే.