రైల్వేజోన్‌ పై టీడీపీ ఎంపీలే నమ్మకం లేదనేశారు..

Update: 2018-02-11 07:17 GMT
టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కేవలం రివ్యూలా మిగిలిందే తప్ప స్ట్రాటజికల్ గా కనిపించలేదు. కేంద్రంతో పోరాటంలో భాగంగా ఇప్పటివరకు ఏం చేశారన్నదే తప్ప ఇకపై ఏం చేయాలి.. లేదంటే కేంద్రం దిగొచ్చేలా సీరియస్ స్టెప్స్ ఏం తీసుకోవచ్చనే విషయంలో చంద్రబాబు ఏమీ చెప్పలేదు. పార్లమెంటు సభ్యులనే ఆయన సలహాలు అడిగారు. మళ్లీ మార్చిలో జరిగే సమావేశాల్లో ఇలాగే నిరసన తెలపాలనుకోవడం తప్ప ఇంకేమీ తేల్చలేదు. అంతేకాదు.. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం కూడా ఉత్తదే అని తేలిపోయింది. అధికారిక ఉత్తర్వు వచ్చే వరకు నమ్మలేమంటూ పలువురు ఎంపీలు వ్యాఖ్యానించడంతో అదంతా ఉత్తమాటలేనని తేలిపోయిది.
    
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను వెంటనే నెరవేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబునాయుడు పార్లమెంట్ సభ్యులను సలహా అడిగారు.  బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని జాతీయ స్థాయిలో గొంతెత్తి చాటామని - అదే స్ఫూర్తితో తదుపరి సమావేశాల్లోనూ నిరసనలు తెలిపి - డిమాండ్లను సాధించుకురావాలని చంద్రబాబు వారితోఅన్నారు.
    
మరోవైపు నిన్నంతా ప్రచారమైన రైల్వే జోన్ అంశాన్ని ఓ ఎంపీ ప్రస్తావిస్తూ.. కేంద్రం సానుకూల సంకేతాలు పంపిందనగా  అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ నమ్మలేమని మిగతావారు అన్నట్లు సమాచారం. జోన్ - హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీ - విద్యాసంస్థలు - రాజధానికి నిధులు తదితర విషయాలపైనా ఎంపీలు చంద్రబాబుతో చర్చించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించిన చంద్రబాబు - కేంద్ర మంత్రులను ఎప్పటికప్పుడు కలసి - వారితో సమస్యల గురించి మాట్లాడుతుండాలని డిమాండ్ల సాధనకు కృషి చేయాలని సూచించారు.
Tags:    

Similar News