2024 ఎన్నిక‌ల్లో టీడీపీ ప్లాన్స్ అదుర్స్‌!

Update: 2021-12-21 04:55 GMT
ఏపీలో ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి.. అంటే.. వెంట‌నే చెప్పే స‌మాధానం 2024. ఖ‌చ్చితంగా అప్పుడే జ‌రుగుతాయి. ముంద‌స్తుకు వెళ్లే ఆలోచ‌న వైసీపీకి లేదు. సో.. వ‌చ్చే 2024లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయి.ఈ నేప‌థ్యంలో ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విజ‌యం ద‌క్కించుకుని తీరాలి. దీనికి రెండు కార‌ణా లు ఉన్నాయి. ఒక‌టి.. అసెంబ్లీ వేదిక‌గా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన శ‌ప‌థం. ``మ‌ళ్లీ ముఖ్య‌మం త్రి అయిన త‌ర్వాతే.. స‌భ‌లోకి అడుగు పెడ‌తా`` అని గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న శ‌ప‌థం చేశారు.

సో.. దీనిని బ‌ట్టి.. టీడీపీ ఖ‌చ్చితంగా విజ‌యం ద‌క్కించుకోవాలి. ఇక‌, మ‌రో అంశం. చంద్ర‌బాబుకు ఇవి దాదాపు చివ‌రి ఎన్నిక‌లు!(ఈ మాట టీడీపీలోనే వినిపిస్తోంది) సో.. ఈ ఎన్నిక‌ల్లో పార్టీ ని విజ‌యం దిశ‌గా న‌డిపించి.. వార‌సుడి కి ప‌గ్గాలు అప్ప‌గించేసి.. తాను ఇక‌, రెస్ట్ తీసుకోవాల‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్నారు. మ‌రో వైపు.. ముఖ్య‌ మైనా.. కాక‌పోయినా.. పార్టీని గెలిపించుకుని తీరాల్సిన అవ‌స‌రం అయితే.. ఉంది. లేక‌పోతే.. కేడ‌ర్ స‌హా కీల‌క నేత‌లు నిల‌బ‌డే ప‌రిస్థితి ఉండ‌దు. మ‌రోసారి వైసీపీ అధికారం లోకి వ‌స్తే.. టీడీపీ నామ‌రూపాలు కూడా క‌ష్ట‌మే!(ఇది కూడా టీడీపీ నేత‌లుచెబుతున్న మాటే)

ఈ క్ర‌మంలో వ‌చ్చే 2024లో పార్టీని అదికారంలోకి తీసుకువ‌చ్చేందుకుచంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగు లు వేస్తున్నారు.ఇప్ప‌టికే నేత‌ల‌ను త‌మ్ముళ్ల‌ను పార్టీలో లైన్‌లో పెడుతున్నారు. తేడా వ‌స్తే.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సంకేతాలు పంపుతున్నారు. అదేస‌మ‌యంలో పార్టీని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రాన్ని కూడా ఆయ‌న నొక్కి చెబుతున్నారు. అంటే.. మొత్తానికి 2024లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు బ‌లంగానే వేస్తున్నార‌ని అర్ధ‌మవుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ఏదైనా తేడా కొడితే.. ఏం చేయాలి? ఎలా ముందుకు సాగాలి? అనే చ‌ర్చ కూడా పార్టీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది.

ఈ క్ర‌మంలోనే పార్టీలో ఒక మెరుపు లాంటి ఆలోచ‌న వ‌చ్చింది. అదే `ఓట‌ర్ల‌ను మార్చ‌డం`. అంటే.. పొరు గు రాష్ట్రంలోని టీడీపీ అనుకూల ఓట‌ర్ల‌ను ఏపీకి తీసుకురావడం. అది కూడా అధికారికంగానే!  ఇందులో ఏమీ చ‌ట్టాన్ని అతిక్ర‌మించే ప‌నిచేయ‌రు. కానీ, కావాల్సింది మాత్రం జ‌రిపించుకుంటారు. అదే ఇందులో ఉన్న మ‌త‌ల‌బు. ఏం చేస్తారంటే.. ఉమ్మ‌డి ఏపీలో టీడీపీకి అటు తెలంగాణ‌లోనూ.. బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. మ‌రీ ముఖ్యంగా ఏపీతో స‌రిహ‌ద్దు పంచుకునే ప్రాంతాల్లో ఇంకా బ‌ల‌మైన ఓట్లు ఉన్నాయి. అయితే.. వీరంతా కూడా తెలంగాణ‌లోనే ఓట్ల‌ను వినియోగించుకుంటున్నారు.

అయితే.. 2014లో అనుస‌రించిన ఫార్ములాను ఇప్పుడు కూడా అమ‌లు చేయాల‌ని చూస్తున్నారు టీడీపీ నాయకులు. తెలంగాణ‌లో ఎలాగూ.. 2023లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయి. దీనిత‌ర్వాత‌.. 8 నెల‌ల‌కు ఏపీలో ఎన్నిక‌లు వ‌స్తాయి. ఈ మ‌ధ్య కాలంలో  టీడీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రుల ఓటు బ్యాంకును ఏపీలోనూ వినియోగించుకునేలా.. టీడీపీ నేత‌లు ప్లాన్ చేస్తున్నారు. అంటే.. అక్క‌డ ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత‌.. ఆయా ఓట‌ర్ల జాబితాను.. అధికారికంగా.. అడ్ర‌స్‌లు ఛేంజ్ చేసి.. ఏపీకి మారుస్తారు. ఫ‌లితంగా వారికి ఏపీలోనూ ఓటు హ‌క్కుల‌భిస్తుంది. ఇది టీడీపీకి లాభించే అంశంగా పేర్కొంటున్నారు.  

ఇలా.. పొరుగు రాష్ట్రంలో టీడీపీ అనుకూల ఓటు బ్యాంకు 6 నుంచి 7 ల‌క్ష‌ల వ‌రకు ఉంటుంద‌ని అంచ‌నా వేసుకుంటున్నారు. దీనిని క‌క‌నుక త‌మకు అనుకూలంగా మార్చుకుంటే.. ఖ‌చ్చితంగా ఏపీలో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు. గ‌త 2014లోనూ ఇలానే చేశార‌ని.. అప్ప‌ట్లో ఈ ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.  ఇందులో చేయాల్సింద‌ల‌ల్లా.. అక్క‌డి టీడీపీ సానుభూతి ప‌రుల ఓట‌ర్ కార్డుల్లో అడ్ర‌స్ ఛేంజ్ చేయ‌డ‌మే!  దీనికి ఏపీలోని టీడీపీ నేత‌ల ఇళ్ల అడ్ర‌స్‌లు ఇస్తారు. దీంతో ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ఓటును ఏపీకి బ‌దిలీ చేస్తుంది. త‌ద్వారా.. ఏపీలో త‌మ వారితో ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏమేరకు ఫ‌లిస్తుందో చూడాలి. 
Tags:    

Similar News