రాష్ట్ర వ్యాప్తంగా చంద్రదండు.. దండెత్తింది. నిండు అసెంబ్లీలో చంద్రబాబును ఆయన సతీమణిని తీవ్రంగా అవమానించిన వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు దండెత్తారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు.. ఆధ్వర్యంలో భారీ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. ఆధ్వర్యంలో తమ్ముళ్లు కదం తొక్కారు. విజయవాడ, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు వైసీపీ నేతలపై దమ్మెత్తి పోశారు. ముఖ్యంగా చంద్రబాబు కన్నీరు పెట్టు కోవడం.. మీడియా సమావేశంలోనూ ఆయన వెక్కి వెక్కి ఏడ్వడం.. వంటివి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కదిలించి వేసిందనే చెప్పాలి. ఇక, టీడీపీ నేతలను ఈ పరిణామాలు కుదిపేశాయి. దీంతో ఎక్కడకక్కడ తమ్ముళ్లు రోడ్డెక్కారు. తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నేతృత్వంలోను.. కృష్ణాజిల్లాలో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలోనూ తమ్ముళ్లు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరంలో.. కర్నూలు, అనంతపురంలోనూ టీడీపీ నాయకులు దండెత్తారు. భారీ ఎత్తున జెండాలు పట్టుకుని.. జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళానాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి.. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీకు ఆడవాళ్లు లేరా? అంటూ.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును నిలదీశారు. ఇక, బూతుల మంత్రి అంటూ.. కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని.. ఆయనను లేకుండా చేసి.. అసెంబ్లీలో ప్రజల కష్టాలకు చర్చించే అవకాశం లేకుండా చేయాలనే పన్నాగం పన్నారని అన్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చంద్రదండు దండెత్తిన తీరు.. నభూతో అన్నట్టుగా సాగింది.