తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు (71) మృతిచెందారు. రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకట్రావును మచిలీపట్నం తరలించారు. అయితే.. పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకెళ్లారు.
అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. గుండెపోటు రావడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం వెంకట్రావు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
కృష్ణాజిల్లా నాగేశ్వరరావుపేటకు చెందిన కాగిత వెంకట్రావు.. టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. పార్టీలో పలు బాధ్యతలు చేపట్టారు. పెడన నియోజకవర్గం నుంచి ఆయన పలు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు. టీటీడీ చైర్మన్ గా, ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. ఇంకా.. రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా కూడా విధులు నిర్వర్తించారు. వెంకట్రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.