టీడీపీ టికెట్ ఫైర్ బ్రాండ్ కి కాదట...?

Update: 2022-11-08 10:30 GMT
ఆమె టీడీపీలో యంగ్ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంటున్నారు. ఆ మధ్యన ఒంగోలులో టీడీపీలో జరిగిన టీడీపీ మహానాడులో తొడకొట్టి సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేసి పారేశారు. ఆమె పేరు గ్రీష్మ. ఆమె ఎవరో కాదు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో స్పీకర్ గా మంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ టీడీపీ  లీడర్ కావలి ప్రతిభా భారతి. ప్రతిభా భారతి 1983 నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. అలా ఆమె ఆరు సార్లు ఎమ్మెల్యే కంటిన్యూస్ గా అయ్యారు.

ఇక 2004లో ఫస్ట్ టైం ఓడిపోయారు. 2009 నాటికి ఆమె ఉంటున్న ప్రాంతం వెళ్లి రాజాంలో కలిసింది. దాంతో రాజాం నుంచి ఆమె 2009లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. 2014, 2019 లలో అయితే ఆమెకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఇక రాజకీయాల పట్ల ఆమె విరక్తి చెంది గుడ్ బై చెప్పేదామని అనుకున్నారు. దాంతో ఆమె కుమార్తె గ్రీష్మను ముందుకు తీసుకువచ్చారు. ఆమె కూడా పార్టీలో తక్కువ సమయంలోనే ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు.

ఏకంగా చంద్రబాబు లోకేష్ ల వద్ద మార్కులు కొట్టేశారు. అయితే రాజాం ముంచి గ్రీష్మ పోటీ చేయాలనుకుంటే అధినాయకత్వం నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రావడంలేదు. దానికి కారణం అదే టీడీపీలో మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ రావు ఉన్నారు. ఆయనకే టికెట్ అని ఆయన అనుచరవర్గం ధీమాగా ఉంది. దాంతో పాటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మద్దతు కూడా ఆయనకే ఉందని టాక్ నడుస్తోంది.

పైగా గ్రీష్మ జూనియర్ లీడర్ అని ఆ విధంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ని తట్టుకోవడానికి కోండ్రు మురళీ మోహన్ కరెక్ట్ పర్సన్ అని భావిస్తున్నారౌట. ఈ పరిణామాలతో ప్రతిభాభారతి ఫ్యామిలీలో చర్చ సాగుతోంది అని అంటున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ అంటే తానే రంగంలో ఉంటే సరిపోతుంది కదా అని మాజీ స్పీకర్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఆమెకే టికెట్ ఇవ్వాలని ఇపుడు ఆమె వర్గం పట్టుబడుతోంది.

తాజాగా శ్రీకాకుళం జిల్లా టూర్ కి వచ్చిన యనమల రామక్రిష్ణుడిని ప్రతిభాభారతి వర్గం నాయకులు కలసి ఆమెకే టికెట్ ఇప్పించేలా చూడాలని విన్నవించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజాం నుంచి మాడం కి టికెట్ ఇస్తే గెలిపించుకుని వస్తామని చెబుతున్నారు. దాని మీద బాబుతో మాట్లాడుతానని యనమల హామీ ఇచ్చారు.

అయితే మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ దూకుడు రాజకీయం చేస్తారు. పైగా మంచి అనుచర గణం ఉంది. అవతల వైపు వైసీపీ నుంచి కంబాల జోగులుకే జగన్ మరోసారి టికెట్ కన్ ఫర్మ్ చేశారు. దాంతో హ్యాట్రిక్ విజయం కోసం జోగులు జోరు చేస్తున్నారు. ఆయన్ని ఢీ కొట్టి గెలవాలంటే మురళీమోహన్ కి ఇవ్వాలని పార్టీలోకి ఒక వర్గం కోరుతోంది. ఇపుడు సడెన్ గా మాజీ స్పీకర్ రేసులోకి రావడంతో హై కమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News