రాబోయే ఎన్నికల్లో టీడీపీ చాలా పెద్ద టార్గెట్టే పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎట్టి పరిస్ధితుల్లోను 151 సీట్లకు మెజారిటి తగ్గకూడదని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గట్టిగా చెప్పారు. పార్లమెంటు నేతల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతు ఇకనుండి జగన్మోహన్ రెడ్డే మనల్ని చూసి భయపడాలని పిలుపిచ్చారు. టీడీపీ వాళ్ళని చూసి జగన్ ఎందుకు భయపడాలో మాత్రం ఎంపీ చెప్పలేదు.
ఎంపీ పెట్టిన టార్గెట్ చూస్తే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 151 సీట్లను మించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వాస్తవంలో జరిగేదేనా అన్న విషయంలోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి ఎంపీకి కూడా అన్ని సీట్లు వస్తాయనే నమ్మకం లేనట్లుంది. కాకపోతే ఏదో చెప్పాలి కాబట్టి వైసీపీకి వచ్చిన 151 సీట్ల ఫిగర్ ప్రస్తావించారంతే. పైగా ఏ సమయంలో అయినా ఎన్నికలు రావచ్చని చెప్పారు.
అంటే ఎంపీ చెప్పిన విషయం ఎలాగుందంటే ముందస్తు ఎన్నికలు రావచ్చన్నట్లుగా చెప్పారు. ముందస్తు ఎన్నికలు రావాల్సిన అవసరం ఏముంది ? ఏముందంటే ఏమీలేదు. ముందస్తు ఎన్నికలు ప్రతిపక్షాలు కోరుకుంటే రావు. ముఖ్యమంత్రి అనుకుంటేనే ముందస్తు ఎన్నికలు వస్తాయన్న విషయం తెలిసిందే. నిజానికి 2003లో ముందస్తు ఎన్నికల కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని రద్దుచేసినా ఎన్నికల కమీషన్ తాను అనుకున్న సమయానికే ఎన్నికలు నిర్వహించింది.
బహెశా ఏదో కేసులో బెయిల్ రద్దయితే జైలుకు వెళ్ళకపోతారా ? ఆపద్ధర్మంగా ఎవరో సీఎం అయినాఆ ఆ తర్వాత అంత:కలహాలతో ప్రభుత్వం కూలకపోతుందా ? అపుడు రాష్ట్రపతి పాలన విధించకపోతారా ? తర్వాత ఎన్నికలు రాకపోతాయా ? అన్న ఆశలో ఉన్నట్లున్నారు తమ్ముళ్ళంతా. ఇవన్నీ జరిగిన తర్వాత టీడీపీకి 151 సీట్లు దాటి రావాలి. టీడీపీ జెండాను చూస్తే వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరుగెట్టాలన్నారు. ఈ కారణంగానే టీడీపీ జెండాను చూస్తేనే జగన్ భయపడాలని ఎంపీ అనుకుంటున్నారు. మరి ఎంపీ కోరుకుంటున్నదే జరగాలని మనం బెస్ట్ విషెస్ చెప్పేద్దామా ?