ఒక ప్రధాన ఉద్యోగం చేస్తూ ఖర్చుల కోసం మరో చిన్నపాటి ఉద్యోగం లేదా పని చేయడాన్ని 'మూన్ లైటింగ్' అంటారు. ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఉంది. అయితే వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ వచ్చాక మూన్ లైటింగ్ విధానం మరింత పాపులర్ అయింది.కరోనా కాలంలో ఐటీ.. తదితర ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు.
ఇదే సమయంలో ఒకటి మించి ఎక్కువ పనులు చేస్తూ రెండు చేతుల సంపాదించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలు ఉద్యోగుల పనిలో నాణ్యత దెబ్బతింటుందని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలోనే మూన్ లైటింగ్ విధానంపై యజమానులకు.. ఉద్యోగులకు మధ్య చర్చకు దారితీసింది.
ఈ క్రమంలోనే పలువురు ఈ మూన్ లైటింగ్ విధానాన్ని సమర్థిస్తూ మాట్లాడగా మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా భారత్ లో మాత్రం మూన్ లైటింగ్ విధానంలో ఎంతో మంది పని చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారనేది మాత్రం వాస్తవం.అయితే వారంతా రెండు పనులు చేయడానికి ఒక్కొక్కరిది ఒక్కో అవసరమని తెలుస్తోంది.
అయితే ఒక అధ్యాపకులు రాత్రివేళల్లో రైల్వే స్టేషన్ లో కూలీగా చేస్తూ మూన్ లైటింగ్ ద్వారా రెండు చేతుల సంపాదిస్తున్నాడు. అయితే ఆయన తన కుటుంబం కోసం కాకుండా పేద పిల్లల చదువు కోసం కూలీగా మారడనే విషయం తెలిసి ప్రతీ ఒక్కరు అతడిని అభినందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!
ఒడిశా రాష్ట్రంలోని గజాం జిలా మనోహర్ గ్రామంలో సీహెచ్ నగేష్ పాత్రో నివసిస్తున్నాడు. పీజీ పూర్తి చేసిన పాత్రో ఒక ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తూ నెలకు రూ.8వేలు సంపాదిస్తున్నాడు. అయితే రాత్రిపూట రైల్వే స్టేషన్ లో కూలి పని చేస్తున్నారు. ఈ డబ్బులను మాత్రం పేద పిల్లల చదువు కోసం వినియోగిస్తున్నట్లు పాత్రో చెబుతున్నాడు.
తాను చిన్నతనం నుంచి చదువు కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. తన తండ్రి గొర్రెల కాపరి ఉండేవాడని.. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందని చెప్పాడు. దీంతో తాను 12వ తరగతి పరీక్షకు హాజరు కాలేకపోయానని.. ఆ తర్వాత చదువుపై మక్కువతో దూరవిద్యలో 12వ తరగతి పూర్తి చేసినట్లు చెప్పారు. అనంతరం డిగ్రీ పూర్తి చేసి బరంపూర్ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా పొందినట్లు వెల్లడించాడు.
కరోనా సమయంలో ఖాళీగా ఉండే బదులు పేద పిల్లలకు ఉచితంగా క్లాసులు చెప్పడం ప్రారంభించినట్లు పాత్రో చెప్పారు. ఈక్రమంలో పిల్లల సంఖ్య బాగా పెరిగిపోవడంతో 8 నుంచి 12 తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని తెరిచినట్లు చెప్పారు. తాను స్వయంగా హిందీ.. ఒడియా బోధిస్తుండగా మిగిలిన సబ్జెక్టుల కోసం నలుగురు అధ్యాపకులను నియమించుకున్నట్లు తెలిపారు.
తన నెల సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపాడు. ఇక రాత్రి పూట వచ్చే కూలీ డబ్బులు దాచి అధ్యాపకులకు జీతం చెల్లిస్తున్నానని చెప్పాడు. చదువు కోసం తనలా పేద పిల్లలు ఎవరూ కష్ట పడకూడదనే ఉద్దేశంతోనే తాను కూలి పని చేస్తూ ఉచితంగా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు.
కాగా ఈ మధ్య రైల్వే స్టేషన్లో ట్రాలీ బ్యాగులు.. ఎస్కలేటర్లు విరివిగా వినియోగిస్తుండటంతో కూలీల సంపాదన బాగా తగ్గిపోయిందని తెలిపాడు. ఈ నేపథ్యంలో కష్టపడి పని చేసే కూలీల కోసం రైల్వే శాఖ ఏదైనా చేయాలని పాత్రో కోరుతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.