పాఠశాలల్లో లైంగిక ఉగ్రవాదులు!

Update: 2015-04-09 11:30 GMT
హైదరాబాద్‌ నుంచి అమెరికా వరకూ అన్నిచోట్లా ఇస్లామిక్‌ ఉగ్రవాదులు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వరకూ ప్రతి ఒక్కరూ వారిని అణచివేయడానికి, ఏరివేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ, చాప కింద నీరులా సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్న ఉగ్రవాదుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. వారే.. పాఠశాలలు, కాలేజీల్లో గురువుల రూపంలో ఉన్న కీచక ఉపాధ్యాయులు.

సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఎవరికైనా దేవుడు కనిపిస్తాడు. కానీ, కొంతమంది ఉపాధ్యాయులకు మాత్రం వారంతా సెక్స్‌ బమ్మలుగా కనిపిస్తున్నారు. ఇంతకు మించిన కిరాతకం ప్రపంచంలోనే మరొకటి ఉండదు. ఇక, మరికొంతమందికి అయితే వృద్ధులు, ముట్లు ఉడిగిపోయిన ముసలివాళ్లు కూడా కనిపించడం లేదు. వారిపై కూడా అత్యాచారాలకు తెగబడుతున్నారు. అన్నిటికంటే దారుణంగా ఇటీవలి కాలంలో పెరిగిన అత్యాచారాలు కానీ అత్యాచార యత్నాలు కానీ పాఠశాలల్లోనే జరుగుతున్నాయి. మంగళవారం కూడా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో రెండు జరిగాయి. వెలుగులోకి రానివి మరెన్నో!

అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు.. ఆంధ్రప్రదేశ్‌ కావచ్చు. చాలా పాఠశాలల్లో ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల వెలుగులోకి రావడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తున్నారు. మరికొంతమందిపై కేసులు నమోదవుతున్నాయి. భయభ్రాంతులతో కొన్ని కేసులు అసలు వెలుగులోకి కూడా రావడం లేదు. వెలుగులోకి వస్తున్న కేసుల్లోనూ పోలీసు స్టేషన్ల వరకూ కేసుల వరకూ వెళుతున్న ఘటనలు పదో వంతేనంటే ఆశ్చర్యం లేదు.

చిన్నారులకు తొలి గురువులు అమ్మానాన్నలు అయితే.. మలి గురువులు ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పుతారు. సంస్కారం నేర్పుతారు. భావి భారత పౌరులు ఎలా తయారవ్వాలో నిర్దేశించేది పాఠశాలలోనే. ఉపాధ్యాయులే ఇంత దారుణంగా రాక్షసంగా ఉంటే వారిని చూసి విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు రేప్పొద్దున్న ఎలా మారతారు!? ఇది మొత్తం సమాజానికే ప్రమాదకరంగా మారుతున్న పరిణామం. అయితే, ఈ ఘటనలు ఎక్కడికక్కడ అక్కడక్కడా జరుగుతుండడంతో పెద్దగా దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఒకటో తరగతిలో అ, ఆలు నేర్పే ఉపాధ్యాయుడి వేతనం ఇప్పుడు దాదాపు రూ.50 వేలు ఉంది. మరికొంతమందికి అయితే అంతకంటే పైనే! ప్రభుత్వం ఎంతో భారంతో అంత పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తుంటే ఉపాధ్యాయులు కాస్తా దారి తప్పుతున్నారు. కొంతమంది పాఠశాలల్లోనే వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. మరికొంతమంది తమ తరఫున షాడో ఉపాధ్యాయులను పెట్టుకుని అసలు పాఠశాలలకే రావడం లేదు. వచ్చినవాళ్లు విద్యార్థులను సెక్స్‌ బానిసలను చేస్తున్నారు. అందరు ఉపాధ్యాయులూ ఇలా ఉన్నారని కాదు. ఎంతమంది మంచివాళ్లు ఉన్నా.. సముద్రంలో ఒక్క ఉప్పు కల్లు వేసినా మొత్తం సముద్రం పాడవుతుందన్నట్లు.. చెడ్డవాళ్లయిన ఉపాధ్యాయులు మొత్తం సమాజాన్నే నాశనం చేస్తున్నారు.

అందుకే, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అయినా.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయినా.. పాఠశాలల్లో లైంగిక ఉగ్రవాదులుగా మారిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ చర్యలు కూడా మన కోర్టు కేసుల్లా ఎప్పుడో తేలడం కాకుండా ప్రత్యేక కోర్టు ఒకటి ఏర్పాటు చేసి సత్వరం శిక్ష విధిస్తే మరొక ఉపాధ్యాయుడు కానీ, మరొకరు కానీ ఇటువంటి తప్పు చేయడానికి జంకేలా అటువంటి శిక్షలు ఉండాలని కూడా కోరుతున్నారు. ఈ దిశగా చంద్రబాబు, కేసీఆర్‌ దృష్టి సారించాలని కోరుతున్నారు.

అందుకే, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అయినా.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయినా.. పాఠశాలల్లో లైంగిక ఉగ్రవాదులుగా మారిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ చర్యలు కూడా మన కోర్టు కేసుల్లా ఎప్పుడో తేలడం కాకుండా ప్రత్యేక కోర్టు ఒకటి ఏర్పాటు చేసి సత్వరం శిక్ష విధిస్తే మరొక ఉపాధ్యాయుడు కానీ, మరొకరు కానీ ఇటువంటి తప్పు చేయడానికి జంకేలా అటువంటి శిక్షలు ఉండాలని కూడా కోరుతున్నారు. ఈ దిశగా చంద్రబాబు, కేసీఆర్‌ దృష్టి సారించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News