తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలై నెలరోజులు దాటిపోయింది. పోయిన నెల సమ్మె మొదలుపెట్టిన కార్మికులకు ఆర్టీసీ సంస్థ జీతాలివ్వలేదు. తాజాగా నవంబర్ 1 వచ్చినా సమ్మెలో ఉండడంతో ఈ నెలా కార్మికులకు జీతాలు అందలేదు. అంటే దాదాపుగా రెండు నెలలు జీతాలు లేకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో పస్తులుంటున్న దుర్భర పరిస్థితి నెలకొంది. రెండు నెలలుగా సమ్మెలో ఉన్న ఈ సుధీర్ఘ సమ్మెకు ముగింపు పలకడం కష్టమేనని నిన్న కేసీఆర్ ప్రకటనతో తేలిపోయింది. ప్రైవేటుకు సగం బస్సులు ఇచ్చేయడంతో ఇక సమ్మెపై కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోదని తేలిపోయింది.
ప్రస్తుతం దాదాపు 49వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. వీరికి జీతాలు చెల్లించడానికి దాదాపు రూ.224 కోట్లు అవసరం. కానీ ఇప్పుడు ఆర్టీసీ సంస్థ వద్ద కేవలం 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. సమ్మె కారణంగా తీవ్రమైన డబ్బు కొరతతో ఆర్టీసీ జీతాలు చెల్లించే పరిస్థితిలో కూడా లేదు.
రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వారికి పూట గడవడమే కష్టంగా మారింది. ఇక పిల్లలకు పాఠశాలల్లో చెల్లించాల్సిన స్కూల్ ఫీజులను కూడా క్లియర్ చేయలేక నరక యాతన అనుభవిస్తున్నారట.. దీంతో తోటి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఎస్ ఎస్సీ పరీక్ష ఫీజును ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా చెల్లించాలని తాజాగా నిర్ణయించారు.
నవంబర్ 7లోగా పదోతరగతి పరీక్ష పీజును కట్టాల్సి ఉంటుంది. దీంతో ఆర్టీసీ కార్మికుల పిల్లలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో తాజాగా యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నేత రఘునందన్ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల పరీక్ష ఫీజులకు సాయం చేయాలని కోరారు. తాను పనిచేస్తున్న పోచంపల్లి పాఠశాలలో దాదాపు 25మంది ఆర్టీసీ కార్మికుల పిల్లలు చదువుతున్నారని.. వారు పరీక్ష ఫీజు కట్టలేకపోవడం చూసి తానే స్పందించి మొత్తం రూ.3750 రూపాయలను చెల్లించినట్టు రఘునందన్ తెలిపారు. ఉపాధ్యాయులు వారి వారి స్కూళ్లలో విద్యార్థుల ఫీజులు కట్టాలని కోరారు.
ఇక సమ్మె ముగిసేవరకు ఆర్టీసీ కార్మికులు ఉంటున్న అద్దె ఇళ్లకు యజమానులు అద్దె వసూలు చేయరాదని కరీంనగర్ లో నేతలు పిలుపునిచ్చారు. ఇలా ఆర్టీసీ సమ్మెలో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు చాలా మంది స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు.