కేసీఆర్ ఫ్యామిలీని హ‌డ‌లెత్తించిన ఫ్లైట్‌!

Update: 2017-02-21 09:17 GMT
టీఆర్ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు కుటుంబానికి తిరుప‌తిలో కాసేప‌టి క్రితం పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. ఎయిర్ ఇండియా పైల‌ట్ స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించ‌డంతో స‌రిపోయింది గాని లేదంటే... కేసీఆర్ కుటుంబానికి పెద్ద ప్ర‌మాదమే ఎదుర‌య్యేది. ఆ వివ‌రాల్లోకెళితే... తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డితే తెలంగాణ‌లోని ప్ర‌ముఖ ఆల‌యాల‌తో పాటు ఏపీలోని దేవుళ్ల‌కు కూడా మొక్కులు చెల్లిస్తాన‌ని కేసీఆర్ మొక్కుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవత‌రించ‌డం, కేసీఆర్ తొలి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఎప్పుడు జ‌రిగిపోయింది. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత దాదాపుగా రెండేళ్ల పాటు త‌న మొక్కుల విష‌యాన్ని మ‌రిచిపోయిన కేసీఆర్‌... ఇటీవ‌లే ఆ మొక్కులు తీర్చుకునే ప‌నిని మొదలు పెట్టారు.

తిరుమ‌ల వెంక‌న్న‌కు సుమారు రూ.5కోట్ల‌తో ఆభ‌ర‌ణాల‌ను ఇచ్చేందుకు ఆయ‌న రంగం సిద్ధం చేశారు. ఇప్ప‌టికే ఆ ఆభ‌ర‌ణాల త‌యారీ పూర్తి కాగా... నేటి సాయంత్రం కేసీఆర్ ప్ర‌త్యేక విమానంలో తిరుప‌తికి వెళ్ల‌నున్నారు. కేసీఆర్‌ తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా అక్క‌డికి వెళుతున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ సాయంత్రం ప‌య‌న‌మ‌వుతుండ‌గా, ఆయ‌న కుటుంబ స‌భ్యులు మాత్రం నేటి మ‌ధ్యాహ్న‌మే బ‌య‌లుదేరారు. హైద‌రాబాదు నుంచి తిరుప‌తికి బ‌య‌లుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో వారంతా ఎక్కారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు తెలంగాణ ప్ర‌భుత్వ అధికారులు కూడా ఆ ఫ్లైట్లో ఉన్నారు. హైద‌రాబాదులో టేకాఫ్ తీసుకున్న స‌ద‌రు విమానం తిరుప‌తి స‌మీపంలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి క్షేమంగానే చేరుకున్నా... అక్క‌డ ల్యాండింగ్ స‌మ‌యంలో మాత్రం అందులో సాంకేతిక లోపం త‌లెత్తింది. దీంతో ల్యాండింగ్ స‌మ‌యంలో కింద‌కు దిగుతున్న స‌ద‌రు విమానం ఉన్న ప‌ళంగా మ‌ళ్లీ గాల్లోకి ఎగిరింది.

ఈ హ‌ఠాత్ప‌రిణామంతో కాసేప‌ట్లోనే తిరుప‌తి చేరుకుంటామ‌నుకున్న కేసీఆర్ కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. మ‌రోవైపు పొరుగు రాష్ట్ర సీఎం కుటుంబ స‌భ్యులున్న విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో తిరిగి పైకి ఎగ‌ర‌డంతో ఎయిర్‌ పోర్టు అధికారులు మ‌రింత‌గా కంగారుప‌డ్డారు. విమానంలో త‌లెత్తిన సాంకేతిక లోపాన్ని స‌కాలంలో గుర్తించిన పైల‌ట్... ఓ 20 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే చ‌క్క‌ర్లు కొట్టించాడ‌ట‌. ఆ త‌ర్వాత విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలా కాకుండా స‌ద‌రు విమానానికి ఏదైనా జ‌రిగి ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భ‌యం వేయ‌క మాన‌ద‌న్న రీతిలో అటు కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఇటు అధికారులు తీవ్ర ఆందోళ‌న‌కు గురయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News