అన్ లాక్ చేస్తే అనర్థమే: డబ్ల్యూ.హెచ్.వో

Update: 2020-09-01 11:50 GMT
కరోనా కేసులు పెరుగుతున్న వేళ మోడీ సర్కార్ అన్ లాక్ ప్రక్రియను చేపట్టింది. అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను ప్రకటించింది. మెట్రో రైళ్ల పునరుద్ధరణ సహా పలు సేవలను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. మిగతా ప్రపంచదేశాలు కూడా అన్ లాక్ ప్రక్రియను చేపట్టాయి.

ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అద్నమ్ ఘెబ్రెయేసిస్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. కరోనా ముప్పు కొనసాగుతున్న వేళ తొందరపడి అన్ లాక్ ప్రక్రియ చేపడితే ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జాగ్రత్తలు తీసుకోకుండా అన్ లాక్ చేపడితే ఇబ్బందులు తప్పవని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. కరోనా అంతం కాలేదని.. జాగ్రత్తగా ప్రజలు వ్యవహరించాలని సూచించారు.

అన్ లాక్ ప్రక్రియ చేపట్టే విషయంలో దేశాలు సీరియస్ గా ఉంటే.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రాణాలను కాపాడడంలో అదే రీతిలో వ్యవహరించాలని టెడ్రోస్ సూచించారు.
Tags:    

Similar News