మనుషులు తమను తాము గొప్పగా చెప్పుకుంటూ ప్రకృతిలోని మిగిలిన అన్నీ జీవరాశుల్ని తనకంటే తక్కువగానే చూస్తాడు. కానీ.. కొన్ని విషయాల్లో మనిషి కంటే కూడా జంతువులు ఎంతో మెరుగు అనిపించటం ఖాయం. పెరుగుతున్న సాంకేతికత.. మనిషి పరిణామక్రమం మరింత ముందుకెళుతున్న సమయంలో ఊహించని కొన్ని ఘటనలు మానవత్వానికే ప్రశ్నార్థకంగా నిలుస్తాయి.
తమ పిల్లల్ని జంతువులు సైతం ఎంతో ప్రేమగా చూస్తాయి. తమకు పుట్టిన పిల్ల చనిపోతే.. దాన్ని టచ్ చేయటానికి కూడా అవి ఇష్టపడవు. ఎవరినీ దగ్గరకు రానివ్వవు. కానీ.. మనసున్న మనిషి.. తెలివైన మనిషి మాత్రం తన తల్లిదండ్రుల్ని సైతం కడతేరుస్తుంటారు. ఇదంతా కేవలం డబ్బు కోసమే. ఇవాళ ఉండి.. రేపు ఉంటుందో ఉండదో తెలీని ఆస్తి కోసం కన్నతల్లిదండ్రుల్ని కడతేర్చిన కసాయిలు ఉన్నట్లే.. కొన్ని విషయాల్లో కన్నబిడ్డల్ని సైతం దారుణంగా హతమార్చే కర్కస తల్లిదండ్రులు ఉన్నారు.
మనిషి ఏదైనా హద్దుమీరి ప్రవర్తిస్తే.. అతగాడ్ని జంతువుతో పోలుస్తుంటాం. కానీ.. జంతువుతో పోల్చటానికి కూడా మనిషి హక్కులేదు. ఎందుకుంటే.. మనిషి జంతువు కంటే ఘోరంగా వ్యవహరిస్తున్న రోజులివి. ఇక.. పురాణాల్లో రాక్షసులు సైతం తమ సొంత బిడ్డల్ని చంపుకున్న ఘోర ఘటనలు కనిపించవు. అంతదాకా ఎందుకు మనుషుల్లో అత్యంత క్రూరులుగా చెప్పుకునే తాలిబన్లు సైతం తమ బిడ్డల్ని చంపుకున్నట్లుగా.. తమ వారిని హింసించినట్లుగా కనిపించదు.
కానీ.. మన పక్కనే ఉండి.. మనతో నవ్వుతూ మాట్లాడుతూ.. జోకులేస్తూ.. సాదాసీదాగా కనిపించే మనుషులు తాలిబన్ల కంటే ప్రమాదకారులన్న విషయం కొన్ని ఘటనలు చూస్తే అనిపించక మానదు. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో నివాసం ఉండే బీఎస్‌ఎన్‌ఎల్‌లో జేటీవోగా పని చేసే రమేష్‌కుమార్ అతని రెండో భార్య ఉదంతం చూస్తే.. మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఉలిక్కిపడతారు. ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నామా? అనిపించక మానదు.
రమేష్ 1991లో సరళ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక అమ్మాయి పుట్టింది. అనంతరం వీరు 2003లో విడాకులు తీసుకున్నారు. తన కుమార్తెను తీసుకొని సరళ వెళ్లిపోయింది. 2010లో ఆమె ఆత్మహత్య చేసుకోవటంతో ఆ అమ్మాయి (ప్రత్యూష) బాధ్యతల్ని మేనమామ తీసుకొని ఒక అనాథ ఆశ్రమంలో చేర్చారు.
ఇదే సమయంలో రమేష్ తనతో పని చేస్తున్న సహ ఉద్యోగిని శ్యామలను పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి పట్టించుకోని రమేష్ 2014లో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. ఆమెతో సవతితల్లి బండచాకిరీ చేయించటంతో పాటు.. ఒంటిమీద వాతలు పడేలా కొట్టటం.. తిట్టటం.. దారుణంగా హింసించటంతో పాటు.. యాసిడ్ తాగించటం లాంటి ఏన్నో దుశ్చర్యలకు పాల్పడేది. అయినా.. కన్నతండ్రి చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. తాలిబన్ల తరహాలో ప్రత్యూషను సవితితల్లి హింసించేది.
తాజాగా ఈ అమ్మాయిపై జరుగుతున్న హింసను చూసిన వారు తల్లడిల్లిపోయి ఒకరు ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. ఆమెను రక్షించేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆ అమ్మాయిని చూసి షాక్ తిన్న పరిస్థితి. ఒళ్లంతా గాయాల పాలై.. చిక్కిశల్యం కావటమే కాదు.. దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆమెను చూసి చలించిపోయారు. చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. మరోవైపు.. తాలిబన్ మాదిరి సవితి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌరవ ప్రదమైన ఉద్యోగాలు చేస్తూ.. ఇంత పైశాచికంగా హింసించటాన్ని చూసిన వారు నివ్వెర పోతున్న పరిస్థితి. ఇలాంటి వారు చేసే దారుణాలకు ఎలాంటి శిక్షలు విధించాలి..?