ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు కమ్ బీహార్ మాజీ మంత్రి..తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాను సీఎం నితీష్ కుమార్ హ్యాక్ చేశారని.. బీజేపీ నేతలతో కలిసి ముఖ్యమంత్రి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. రాజకీయాల నుంచి తనను తప్పుకోమన్నట్లు తన తల్లి.. మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి తనను ఆదేశించినట్లుగా ఫేస్ బుక్ లో తప్పుడు పోస్టులు చేస్తున్నట్లు చెప్పారు.
రాజకీయంగా తనను ఎదుర్కొనలేక.. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తనను టార్గెట్ చేస్తున్నట్లుగా మండిపడ్డారు. తమపై నేరుగా పోరాడలేక.. తమ ఫ్యామిలీ మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించారు. ఎన్నికల్లో లబ్థి పొందటానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నట్లుగా ఫైర్ అయ్యారు.
తమ కుటుంబంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని.. తామంతా ఐక్యంగా ఉన్నట్లుగా ఆయన చెప్పారు. తన సోదరుడు.. బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు తనకూ ఎలాంటి విభేదాలు లేవన్నారు. బీజేపీ..జేడీయూ ఎన్ని కుట్రలు చేసినా 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమపార్టీ విజయం సాధిస్తుందన్నారు. తేజ్ ప్రతాప్ రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్లుగా సినిమాల్లోకి వెళ్లనున్నట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. అయినా.. కుర్రాడైన తేజ్ ప్రతాప్ సోషల్ ఖాతాను సీఎం నితీశ్ హ్యాక్ చేయటం ఏమిటి? చురుగ్గా ఉండే వయసులో ఉన్న తేజ్.. సోషల్ ఫ్లాట్ ఫాంతో చెలరేగిపోవాలే కానీ.. ఇలా ఆరోపణలు చేయటం ఏమిటి?