అంగరంగ వైభవంగా పెళ్లి జరిగి ఆర్నెల్లు కాలేదు. కానీ.. అప్పుడే విడాకులకు కోర్టులో అప్లై చేయటం ద్వారా షాకిచ్చారు ఆర్జేడీ అధినేత కుమారుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు కమ్ బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. ఆర్నెల్ల క్రితం ధూమ్ ధాంగా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.
విడాకుల కోసం కోర్టులో దాఖలు చేసుకున్న వైనాన్ని తేజ్ ప్రతాప్ న్యాయవాది యశ్వంత్ కుమార్ శర్మ ధ్రువీకరించారు. పట్నా కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లుగా లాయర్ వెల్లడించారు. బిహార్ మాజీ మంత్రి.. ఆర్జేడీ నేత చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్యారాయ్ తో తేజ్ ప్రతాప్ పెళ్లి జరిగింది. మే 12న జరిగిన వారి వివాహానానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అయితే.. పెళ్లి జరిగిన కొద్ది కాలానికే విడాకులకు అప్లై చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. సాంకేతిక అంశాల కారణంగా కోర్టు ఈ దరఖాస్తును రిజెక్ట్ చేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మరోసారి విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవటం గమనార్హం. తేజ్ ప్రతాప్ కు ఐశ్వర్యతో విభేదాలు వచ్చాయని.. దీంతో హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలని భావిస్తున్న విషయాన్ని వెల్లడించారు.
తేజ్ ప్రతాప్ లాయరు మాట్లాడుతూ.. తానీ క్షణంలో ఇంతకు మించి మరింకేమీ మాట్లాడలేనని.. వారిద్దరూ విడిపోవాలని అనుకుంటున్న విషయాన్ని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆసక్తికరమైన అంశం ఏమంటే తేజ్ ప్రతాప్ సోదరి మీసా భారతి మాట్లాడుతూ.. విడాకుల వ్యవహారంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకు ఈ విషయం తెలీదని.. మీడియా ద్వారానే తెలిసిందన్నారు. ఇంతకీ తన కొడుకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన విషయం ఆర్జేడీ అధినేత లాలూకు తెలుసా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.