తరచుగా వార్తల్లో నిలిచే బీహార్ మాజీ మంత్రి - లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరోమారు అనూహ్యమైన రీతిలో తెరమీదకు వచ్చారు. ఈ దఫా ట్విట్టర్ ద్వారా తన మనో వేదనను వ్యక్తపరిచాడు. ఇటీవలే భార్య ఐశ్వర్య రాయ్ నుంచి తేజ్ ప్రతాప్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 2వ తేదీన తేజ్ ప్రతాప్ ఈ విషయాన్ని బయటకు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టుకు కూడా వెళ్లాడు. కానీ ఆ రోజు నుంచి మాత్రం ఇంటికి వెళ్లడం లేదు. దీంతో ఇంట్లో వాళ్లు తేజ్ ప్రతాప్ కోసం కలవరపడుతున్నారు. కొత్త జంటను మళ్లీ కలపాలని ఇంట్లో వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తేజ్ ప్రతాప్ ను నచ్చచెప్పేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అయితే, అవేమీ ఫలించడం లేదు.
ఈ ఏడాది మే 12న ఆ రాష్ట్ర మాజీ సీఎం ప్రసాద్ రాయ్ మనవరాలును తేజ్ ప్రతాప్ పెళ్లి చేసుకున్నాడు. వాస్తవానికి తనకు ముందు నుంచే ఈ పెళ్లి అంటే ఇష్టం లేదన్న విషయాన్ని తేజ్ ప్రతాప్ చెప్పుకొచ్చాడు. మా మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించలేమని - పెళ్లికి ముందే ఈ విషయాన్ని మా పేరెంట్స్ కు చెప్పానని - కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు - ఇప్పుడూ ఎవరు వినిపించుకోవడం లేదని తేజ్ ప్రతాప్ అన్నాడు. నా మనసును వాళ్లు అర్థం చేసుకోనప్పుడు - నేను ఎలా ఇంటికి వెళ్లాలి అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నాడు. ఇంటికి దూరంగా ఉంటున్న తేజ్ ప్రతాప్ గత రెండు వారాలుగా వింద్యాచల్ - వారణాసి - వృందావన్ - హరిద్వార్ లో తిరుగుతున్నాడు. మరోవైపు తేజ్ ప్రతాప్ దాంపత్యాన్ని ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తుంటే..మరోవైపు తేజ్ ప్రతాప్ గాయపడిన తన హృదయానికి సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఒక బంధం బద్దలైతే అది మళ్లీ కలవదు అన్న ఉద్దేశం వచ్చేలా ఓ కవి భావనను ట్వీట్ చేశాడు. 16వ శతాబ్ధానికి చెందిన అబ్దుల్ రహీమ్ ఖాన్ రాసిన ఓ కవిత నుంచి తీసిన లైన్ ను అతను పోస్టు చేశాడు.