ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. డిజిటల్ పుణ్యమా అని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శించే నెటిజన్లు.. తమ దృష్టికి వచ్చిన ఈ ఫోటోను వెంటనే క్రాస్ చెక్ చేయటం షురూ చేశారు. ఒక రాజకీయ పార్టీ అధినేత.. యంగ్ మినిస్టర్ (ఇప్పుడు పదవి లేదనుకోండి).. అతని పక్కనే చురుకుదనంతో కనిపిస్తున్న యువతి కనిపించిన వెంటనే.. ఎవరు? ఏమిటి? అన్న సందేహాలు రావటం.. వాటిని తెలుసుకోవటానికి సెర్చింజన్ సాయంతో విపరీతంగా వెతకటం అలవాటే.
రెండు మూడు రోజులుగా సెర్చింజన్ కు శోష పుట్టేలా వెతికేస్తున్న బీహార్ మాజీ మంత్రి.. ఆర్జేడీ అధినేత లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పక్కనే ఉన్న ఒక యువతి వివరాలు తెలుసుకోవటంపై పలువురు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒక యువతి పక్కన తేజ్ దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఆదివారం పాట్నాలో జరిగిన లాలూ ర్యాలీ సందర్భంగా ఈ యువతి హాజరైనట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా సదరు యువతి లాలూ పెద్ద కొడుకుతో ఫోటో దిగినట్లుగా చెబుతున్నారు.
ఇంతకీ ఆ యువతి ఎవరన్న వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు పంఖుడీ పాఠక్. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లా విద్యార్థిని. ఈ ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ ఆమెను అధికార ప్రతినిధిగా నియమించారు. సోషల్ మీడియాలో సమాజ్ వాదీ పార్టీ స్టాండ్ తెలిపేందుకు వీలుగా ఆమెను అపాయింట్ చేశారు. 1992లో జన్మించిన ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు. ఎలాంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన పంఖుడీ.. చాలాకాలంగా సమాజ్ వాదీ పార్టీ విద్యార్థి విభాగంలో ఉంటున్నారు.
2010లో హంస్ రాజ్ కాలేజీలో జరిగిన ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా గెలిచిన ఆమె.. 2013లో సమాజ్ వాదీ పార్టీ ఆమెను లోహియా వాహిని జాతీయ కార్యదర్శిగా నియమించారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈమెకు ఫేస్ బుక్ లో వేలాది మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నాక.. వేల మంది ఉండకుండా ఉంటారా ఏంటి?