ఇంకో ఆదివారం తెలంగాణ అసెంబ్లీ మీటింగ్‌

Update: 2017-04-26 16:12 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. గ‌తవారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై మైనార్టీలు - ఎస్టీల కోటా పెంచేందుకు ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించిన తెలంగాణ స‌ర్కారు తాజాగా ఈనెల 30వతేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. భూసేకరణ సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం సూచనలతో భూసేకరణ బిల్లులో మూడు సవరణలు చేయనున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే గ‌త స‌మావేశం ఆదివార‌మే నిర్వ‌హించ‌గా 30 వ తేదీ సైతం ఆదివారం కానుంది.

కాగా, భూసేకరణ సవరణ బిల్లు విషయంలో కేంద్ర సర్కార్‌ నిర్ణయం అనుకూలమేనని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ భూసేకరణ బిల్లును కేంద్రం వెనక్కి పంపలేదని, కేంద్రం కేవలం సవరణలు మాత్రమే సూచించిందని తెలిపారు. అయితే ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు అవ‌గాహ‌న రాహిత్యంతో విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని హ‌రీశ్ రావు మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News