సండే.. తెలంగాణ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశం

Update: 2017-04-12 05:23 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త భిన్నం. తానేం చేయాల‌నుకున్నా చేసేస్తారు. ఇన్ని రోజులు ఉన్నా.. అంద‌రికి సెల‌వైన ఆదివారాన్ని ఏరి కోరి మ‌రీ..తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ప్ర‌త్యేకంగా కొలువు తీరుస్తున్నారు. ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఎందుక‌లా అన్న విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ముస్లింలు.. ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అల్రెడీ డిసైడ్ కావ‌టం తెలిసిందే. అదే స‌మ‌యంలో.. కేంద్రం ఆమోదించిన జీఎస్టీ బిల్లును కూడా ఆమోదించాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే.. ఈ రెండు విష‌యాల్ని ప్ర‌త్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి.. ఆమోద ముద్ర వేయాల‌ని కేసీఆర్ అనుకున్నారు.

అంతే.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ ను కోర‌టం.. ఆయ‌న ఓకే అన‌టం జ‌రిగిపోయింద‌ని చెబుతున్నారు. అంద‌రికి సెల‌వైన ఆదివారం.. తెలంగాణ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశం అంటూ స‌హ‌జంగానే అంద‌రి దృష్టి అసెంబ్లీ మీద ప‌డ‌టం ఖాయం. ఇలాంటి వేళ‌.. త‌మ వైఖ‌రిని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌టం కోసం.. తాము ఏవ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ఇంత‌గా శ్ర‌మిస్తున్నామో.. వారంతా తీరుబ‌డిగా చూసేందుకు అవ‌కాశం ఉండేలా కేసీఆర్ నిర్ణ‌యం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ముస్లింల‌కు4 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌ల్లో ఉంది. దాన్ని ఎంత‌కుపెంచాలి? న‌్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి? లాంటి  అంశాల‌పై సాధ్యాసాధ్యాల‌పై స‌మీక్షించి.. బిల్లును సిద్ధం చేయాల‌ని అదికారుల‌కు కేసీఆర్ స‌ల‌హా ఇచ్చార‌ని చెబుతున్నారు.  ఇదిలా ఉండ‌గా..వెనుక‌బ‌డిన కులాల సామాజిక స్థితిగ‌తుల‌పై అధ్య‌య‌నం చేసిన బీసీ క‌మిష‌న్ తాజాగా త‌న నివేదిక‌ను సీఎంకు అంద‌జేసింది. ఇందులో ముస్లింల‌కు ఇవ్వాల‌నుకుంటున్న రిజ‌ర్వేష‌న్ల మీద ప్రస్తావించిన‌ట్లుగా తెలుస్తోంది. బీసీ క‌మిష‌న్‌త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించిన కొద్దిసేప‌టికేరాజ్ భ‌వ‌న్ కు వెళ్లిన కేసీఆర్‌.. ఆయ‌న‌తో అర‌గంట పాటు భేటీ కావ‌టం గ‌మ‌నార్హం. బీసీ క‌మిష‌న్ లోని ముఖ్యాంశాల్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్ల‌టంతో పాటు.. ముస్లిం.. ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు.. జీఎస్టీబిల్లుకు ఆమోదం లాంటి అంశాల కోసం ఈ నెల 16న రాష్ట్ర అసెంబ్లీని ప్ర‌త్యేకంగా కొలువు తీర్చాల‌నికోరిన‌ట్లుగా చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి చెప్పిన దానికి గ‌వ‌ర్న‌ర్‌సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో.. అంద‌రికి సెల‌వు రోజున తెలంగాణ రాష్ట్ర శాస‌న స‌భ మాత్రం ప్ర‌త్యేకంగా కొలువు తీర‌నుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News