ఆర్థిక స్థితిలో తెలంగాణ మెరుగు, ఆంధ్రా దారుణం

Update: 2020-02-05 05:40 GMT
తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని.. ఆర్థిక మాంద్యం, తగ్గిన రాబడులతో పాలన కష్టంగా మారిందని ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ లు వాపోయిన సంగతి తెలిసిందే.. కాళేశ్వరంతో కేసీఆర్,గత చంద్రబాబు చేసిన అప్పులతో జగన్ సతమతమయ్యారని అప్పుల ఊబిలో రాష్ట్రాలు కూరుకు పోయాయని ప్రతిపక్షాలు విమర్శించాయి.

అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్ లో కేంద్రం అధికారికంగా స్పష్టత నిచ్చింది. తెలంగాణ పరిస్థితి బాగుందని.. ఏపీలో ఆర్థిక పరిస్థితి చెత్తగా ఉందని పేర్కొంది.

పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానం గా కేంద్రం ఈ గణాంకాలను వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ రుణ-జీడీపీ నిష్పత్తి అనుమతించ దగ్గ పరిమితుల్లో ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఏపీ ఆర్థిక స్థితి రుణ -జీడీపీ నిష్పత్తి ఆందోళన కరంగా ఉందని తెలిపింది.

దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ జీడీపీ 17శాతంగా ఉందని.. దేశంలోనే రెండవ అతి తక్కువ అప్పు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు జీడీపీలో 31.6శాతానికి చేరాయని తెలిపింది. నిర్ధేశిత పరిమాణం కంటే 11.6శాతం అధికంగా ఉందని తెలిపింది. తెలంగాణ మాత్రం నిబంధనలకు లోబడే ఉంది. ఏపీ ప్రభుత్వం భారీగా రుణాలపై ఎలా ఆధార పడి ఉందో తెలిపింది.

జీడీపీ నిష్పత్తిలో 16.9శాతానికి అతి తక్కువ రుణంతో మహారాష్ట్ర అగ్ర స్థానంలో ఉందని.. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అప్పులు 48శాతంగా ఉన్నాయని తెలిపింది.

తాజాగా ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఆర్థికలోటు, జీడీపీ , ఎఫ్ఆర్బీఎం సమీక్ష నివేదిక ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. అత్యధికంగా జమ్మూకశ్మీర్ రుణాలు జీడీపీ లో 48.2శాతానికి చేరాయి.
Tags:    

Similar News