ఆదివారం రాత్రి అనూహ్యంగా చోటు చేసుకున్న ఘర్షణలతో భైంసాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటం తెలిసిందే.భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలతో భైంసాలో సాధారణ పరిస్థితుల్ని తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగి మూడు రోజులైనా.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరకపోవటం గమనార్హం. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు114వ సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
షాపులు మూసేసిన వ్యాపారులు.. ఇళ్లలో నుంచి బయటకు కూడా రాలేదు. వీధుల్లోకి జన సంచారం లేకుండా పరిమితులు విధించారు. దీంతో.. పట్టణమంతా నిశ్శబద్దంగా ఉంది. డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. పాలు..కూరగాయలు లాంటివి దొరకపోవటంతో ప్రజలు నిత్యవసరాల కోసం ఇబ్బందులకు గురయ్యారు. ఎవరికి వారు ఇళ్లల్లోనే పరిమితం కావటంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు పర్యటించారు. సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి.. బందోబస్తును కట్టుదిట్టం చేయటంతో పాటు.. పలు చోట్ల పికెటింగ్ లు ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియా ద్వారా వైషమ్యాల్ని వ్యాప్తిచేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే కొన్నిచోట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించినట్లుగా వార్తలు వచ్చాయి.ఒక విలేకరి మీద పోలీసులు లాఠీ ఎత్తటం.. గుర్తింపు కార్డు చూపించినా దురుసుగా వ్యవహరించినట్లు ఫిర్యాదు అందింది. ఇదిలా ఉంటే.. నగరంలో పరిస్థితులు చక్కబడ్డాయని భావిస్తున్న వేళ.. ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం ప్రాంతంలోని ఖాజీమంజిల్ వద్ద ఒక కారు అనుమానస్పదన రీతిలో దగ్థం కావటంతో ఆందోళన వ్యక్తమైంది.
భైంసా పట్టణంలో అల్లర్లకు కారణమైన 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 52 మందిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. సీసీఫుటేజ్ సాక్ష్యాలతో పదిహేను కేసులు పెట్టినట్లుగా పోలీసులు చెబుతుున్నారు. వీరిలో వివిధ రాజకీయ పార్టీల కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు పరారీలో ఉండగా.. వారి ఆచూకీ కోసం 60 మంది పోలీసులతో ఆరుప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యల్నిచేపట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. నివురు గప్పిన నిప్పులా భైంసాలో పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రోజు (బుధవారం) కూడా దుకాణాల్ని తెరిచే అవకాశం తక్కువేనన్నమాట వినిపిస్తోంది.