తెలంగానం : కేసీఆర్ ఇలాకాలో బీజేపీ కుంప‌ట్లు ?

Update: 2022-05-16 05:07 GMT
ఎప్ప‌టి నుంచో బీజేపీ పై యుద్ధం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కులు. కేంద్రంలో ఉన్న పాల‌కుల తీరు కార‌ణంగానే తామంతా అవ‌స్థ ప‌డుతున్నామ‌ని ఎన్నో సార్లు ఎన్నో వేదిక‌ల‌పై కేసీఆర్ చెప్పారు.  తాజాగా స‌బితమ్మ కూడా వంట గ‌దిలో ధ‌ర‌ల మంట‌లకు బీజేపీనే కార‌ణం అని అంటున్నారు.

ఇక తుక్కుగూడ స‌భ త‌రువాత టీఆర్ఎస్ పార్టీలో కూడా అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌యింది. కొన్ని దిద్దు బాటు చ‌ర్య‌ల‌కు కూడా స‌న్న‌ద్ధం అవుతోంది. పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా మాట్లాడాల‌ని భావిస్తూ వ‌స్తోంది. మ‌త ప్రాతిప‌దికన, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న పైకి కొన్ని మాట‌లు చెప్పినా, అమిత్ షా ప్ర‌భావాన్ని కొట్టి పారేయ‌లేం.

ఎందుకంటే అమిత్ షా మాట‌ల కార‌ణంగా ముస్లీం ఓట్లు చీలిపోయే ప్ర‌మాదం ఉంది. అదేవిధంగా విధాన ప‌ర‌మ‌యిన నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు కొన్ని చేసినా కూడా అవ‌న్నీ కేసీఆర్ త‌ట్టుకుని తిప్పి కొట్ట‌గ‌ల‌రు. కానీ రిజ‌ర్వేష‌న్ల గొడ‌వ‌ను తెర‌పైకి తెస్తేనే హైద్రాబాద్ లో కేసీఆర్ నెగ్గుకు  రావ‌డం క‌ష్టం. ఇదే సంద‌ర్భంలో మేం అంతా ఒక్క‌టే అని ఎంఐఎంతో చెప్పించినా  కొంత ఫ‌లితం సానుకూలంగా ఉంటుంది. ఉండేందుకు అవ‌కాశాలూ మెరుగు ప‌డ‌తాయి.

అంటే ఇప్ప‌టికిప్పుడు కేసీఆర్, పెద్ద ఓవైసీ క‌లిసి ఓ ప్రెస్మీట్ పెడితే త‌ప్ప బీజేపీని నిలువ‌రించ‌డం అంత సులువు కాదు. మ‌రోవైపు ఇంటి గుట్టు తెలిసిన నాయ‌కులంతా బీజేపీ వైపే ఉన్నార‌ని తెలుస్తోంది. వాళ్లు కూడారేపో మాపో ఆ పార్టీ గూటికి వెళ్తే ఈటెల‌కు మంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం ఖాయం.

అదేవిధంగా అదే ప‌నిగా  ఈటెలను టార్గెట్ చేస్తూ మాట్లాడినా కూడా కేసీఆర్-కే న‌ష్టం. వాస్త‌వానికి కేసీఆర్ కోరుతున్న విధంగా చాలా విష‌యాల్లో బీజేపీ సాయం అందించింది. అందులో సందేహాల‌కు తావే లేదు. తెలంగాణ‌కు న‌ష్టం చేసిన దాఖ‌లాలు త‌క్కువే ! అయితే ఆర్థిక సాయంలో తెలుగు రాష్ట్రాల‌కు బీజేపీ కాస్త వెనుకంజ‌లోనే ఉంది.

అయినా  కూడా వాటిని కూడా మాట్లాడి నెగ్గించుకోవ‌చ్చు. ఇవేవీ చేయ‌కుండా తెలంగాణలో మ‌రో పార్టీ ఎదుగుద‌ల‌ను మ‌రీ ఓర్వ‌లేనితనంగా కేసీఆర్ భావించ‌డం త‌గ‌దు. అలా అని  మ‌త రాజ‌కీయాలతోనే బీజేపీ  నెగ్గుకు వ‌స్తుందా అంటే చెప్ప‌లేం.
Tags:    

Similar News