పెళ్లికొచ్చిన బాయ్ ఫ్రెండ్..వరుడికి షాకిచ్చిన వధువు

Update: 2020-03-01 06:27 GMT
ఈ కాలంలో పెళ్లింటే గొప్పగా చేస్తున్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే వధువుకు/వరుడుకు అసలు పెళ్లి ఇష్టం ఉందా లేదా అన్నది తెలుసుకోలేకపోతున్నారు. తీరా పెళ్లికి రెడీ అయ్యి పెళ్లి కూతురులు జంప్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ కాలంలో అంతా ప్రేమమయం.. యువత ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నారు. డేటింగ్ లు, అర్థం చేసుకొని ఒక్కటవుతున్నారు. తల్లిదండ్రులు చూసే పెళ్లిళ్లు   ముక్కు మొహం తెలియని వారిని చేసుకోవడం లేదు.

ఇటీవలే కేరళలోని తిరురంగడిలో పెళ్లికి కొద్ది గంటల ముందు వధువు తను ప్రేమించి అబ్బాయితో పారిపోయింది. దీంతో వరుడి పరువు పోకుండా అదే ముహూర్తానికి మరో అమ్మాయితో పెళ్లి జరిపించారు.

తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లా చర్లపల్లి గ్రామంలోనూ సేమ్ సిన్ రిపీట్ అయ్యింది. వివాహానికి అంతా సిద్ధమై.. తాళి కట్టే సమయానికి పెళ్లి కూతురు పీటలపై నుంచి లేచి తనకు పెళ్లి వద్దని హాలు నుంచి బయటకు వెళ్లిపోయింది.

ఆమె ప్రియుడు పెళ్లి మండపంలోకి రావడంతో అతడిని చూసిన పెళ్లికూతురు ఆగలేకపోయింది. అతడిని చేయిపట్టుకొని బయటకు వెళ్లిపోయింది. అనంతరం పెళ్లికూతురు తల్లిదండ్రులు వచ్చి వెతికే లోగానే కనిపించకుండా పోయారు. వారి కోసం వధువు కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. పెళ్లి కూతురు పారిపోవడంతో వరుడు పరువు గంగలో కలిసింది.  ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు
Tags:    

Similar News