తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్తావన తీసుకువచ్చిన వెంటనే ఒక విషయం తెరమీదికి వచ్చింది. గతంలోనూ ఇలానే చాలా మంది నాయకులు జాతీయ రాజకీయాలు అంటూ ఊగిస లాడారు. ముఖ్యంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌యాదవ్, ఇదే రాష్ట్రానికి చెందినమాజీ సీఎం మాయావతి.. ఇలా కొంతమంది నాయకులు.. హడావుడి చేశారు. ఇంకేముంది.. ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని కూడా ప్రకటించేవారు.
అయితే.. ఎటొచ్చీ.. మూడు అడుగులు పడగానే.. ప్రధాని పీఠం విషయానికి వచ్చే సరికి.. నాలుగు అడుగు లు వెనక్కి పడేవి. అంటే.. ప్రధాని పీఠం తమకంటే.. తమకే కావాలని.. నాయకులు .. పట్టుబట్టే వారు. అంతే.. అప్పటి వరకు ఉన్న జట్టు ముక్కలై.. ఎవరి రాష్ట్రానికి వారు పరిమితమైన పరిస్థితి కనిపించింది.
ఇక, ఇప్పుడు ప్రధాని పీఠం విషయాన్ని పక్కన పెడితే.. కేసీఆర్‌తో కలసి వచ్చే నాయకులు ఎవరు? వారికి అడ్డు వస్తున్న అంశాలు ఏంటి? అనే విషయాలను పరిశీలిస్తే.. 'మోడీ' నే కనిపిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
మెజారిటీ నాయకులు.. మోడీకి ఉన్న ప్రజాభిమానం.. ఆయన హవాపై ఇప్పటికీ.. అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజానాయకుడిగా.. మోడీ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకు న్నా.. ఎన్ని రకాలుగా ధరలు పెంచినా.. మోడీని కోరుకుంటున్న వారి సంఖ్యలో స్పల్ప తేడా తప్ప.. ఆశిం చినట్టు లేదా.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు మాత్రం ఆయన గ్రాఫ్ ఎక్కడా పడిపోలేదు. పైగా.. మాటల మాంత్రికుడిగా.. ఆయన పేరు తెచ్చుకున్నారు.
ప్రాంతీయ పార్టీలను తన గుప్పిట ఉంచుకుని చక్రం తిప్పుతున్నారనే వాదన కూడా మోడీ విషయంలో వినిపిస్తోంది. ఇన్ని సానుకూలతలు.. సందేహాలు ఉన్న నేపథ్యంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ.. ఇలా అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కేసీఆర్ ఏకతాటిపైకి తీసుకురావడం.. ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదని చెబుతున్నారు.
అయితే.. ఈ విధానంతో .. ఆయన బీజేపీకి కానీ, కాంగ్రెస్‌కు కానీ.. ఒకింత ఇబ్బంది అయితే.. కల్పించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మోడీ హవా తగ్గనంత వరకు.. కేసీఆర్ సహా ఎవరూ.. జాతీయస్థాయిలో ఆశించిన మేరకు చక్రం తిప్పడం కష్టమేనని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.