దేశానికి దారి చూపించాల్సిన అవసరం వచ్చేసింది. ప్రధానమంత్రి మోడీ కారణంగా దేశం సర్వనాశనం అవుతుంది. దేశంలో అందుబాటులో ఉన్న సాగునీరు లెక్క తెలుసా? ఉత్పత్తి అయ్యే కరెంటు లెక్కలు తెలుసా? ఎంతమంది యువత ఉన్నారో తెలుసా? వాళ్లతో ఏమేం చేయొచ్చో తెలుసా? దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలెన్నో తెలుసా? అసలు మత సామరస్యం ఏమిటో తెలుసా? ఇలా చెప్పుకొస్తే.. మోడీ ప్రభుత్వం మీద బారెడు ఫిర్యాదుల జాబితాను పట్టుకొని.. దేశం నలుమూలల నుంచి పలువురిని తన ప్రగతి భవన్ కో.. ఫాంహౌస్ (అదేనండి ఫార్మర్ హౌస్)కు రప్పించుకొని తన స్వప్నాన్ని గంటల కొద్దీ చెబుతున్న సీఎం కేసీఆర్ కు తన రాష్ట్రంలో.. తన పోలీసులు.. అధికారులు ఏమేం చేస్తున్నారన్న సంగతి తెలుసా? అన్నదిప్పుడు సందేహంగా మారింది.
విచిత్రమైన విషయం ఏమంటే దేశానికి దారి చూపిస్తానని చెబుతున్న కేసీఆర్.. తన రాష్ట్రంలో తనను ఎన్నుకున్న ప్రజల విషయంలో చోటు చేసుకున్న ఒక దారుణ ఉదంతానికి పత్రికలు సైతం సరైన ప్రాధాన్యతను ఇవ్వకపోవటం. ప్రభుత్వం నిర్మించే రిజర్వాయరు నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చేస్తే ఏ గొడవా ఉండదు. కానీ.. అలా ఇవ్వని వేళ.. ఆందోళనకు సిద్ధమైన నిర్వాసితుల విషయంలో పోలీసులు.. అధికారులు వ్యవహరించిన తీరు చూస్తే.. కేసీఆర్ దేశానికి చూపించే దారి ఇదేనా? అన్న సందేహం కలుగక మానదు.
తమకు పరిహారం ఇచ్చిన తర్వాతే సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తుల విషయంలో దారుణంగా వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. టీఆర్ఎస్ కు బలమైన కోటలా నిలిచే సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలంలో నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయరు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి అనే గ్రామంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఘటనలు చూస్తే.. షాక్ తినాల్సిందే.
అర్థరాత్రి వేళ కరెంటు సరఫరాను నిలిపివేసి.. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న వారి ఇళ్లల్లోకి దూరి వారిని కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నం చూస్తే.. చాలా సినిమా సన్నివేశాలు గుర్తుకు రాక మానదు. ఆడా మగా అన్న తేడా లేకుండా అడ్డుకున్న వారందరిని లాఠీలతో కుమ్మేసిన వైనం చూస్తే.. ఇలాంటి ప్రభుత్వం దేశానికి దారి చూపిస్తానని చెబుతుందా? అనుకోకుండా ఉండలేం.
రిజర్వాయరు ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వివిధ విభాగాల కింద పరిహారం రావాల్సిన దాదాపు 700 మంది గ్రామస్థులు సర్వేను అడ్డుకుంటున్నారు. వారికి ఇవ్వాల్సిన పరిహార మొత్తాన్ని ఇచ్చేస్తే ఏ గొడవా ఉండదు. కానీ.. అందుకు భిన్నంగా అధికారులు మాత్రం ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల వేళలో పెద్ద సంక్యలో పోలీసులు గుడాటిపల్లికి చేరుకున్నారు. ఆందోళనల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారి ఇళ్లను గుర్తించి.. అందులోకి వెళ్లి వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు పోలీసులను అడ్డుకోవటంతో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో చెలరేగిపోయిన భద్రతా బలగాలు లాఠీలకు పని చెప్పటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయినా.. అర్థరాత్రి వేళలో ఇళ్ల్లల్లోకి దూరి దాడులు చేయటం ఏమిటి? అన్నది ప్రశ్న.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టాలంటూ నిర్వాసితులు హుస్నాబాద్ పోలీసు స్టేషన్ ముట్టడికి బయలుదేరారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. పలు సందర్భాల్లో వారిపై పోలీసులు దాడికి పాల్పడిన వైనం వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చేసింది. పరిహారం చెల్లించకుండా తప్పు చేస్తున్న ప్రభుత్వం.. దాన్ని ప్రశ్నించినందుకు అర్థరాత్రి వేళ ఇళ్లల్లోకి దూరి దొంగల్ని కొట్టినట్లు కొట్టటమా? అంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
దేశానికి దారి చూపించాలన్న ఆత్రుత ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందు తన ఇంటిని సర్దుకుంటే మంచిది. న్యాయంగా అందాల్సిన పరిహారాన్ని అడిగితే.. లాఠీలకు పని చెప్పిన వైనం దేశానికి రోల్ మోడల్ ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి తన స్వప్నానికి అడ్డుగా నిలుస్తాయన్న విషయాన్ని సీఎం కేసీఆర్ మర్చిపోతున్నారా? అన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే నిర్వాసితుల మీద లాఠీ ఛార్జి చేయలేదని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత చెబుతున్నారు. మరి.. బాధితులకు గాయాలు మాటేమిటి? అన్న ప్రశ్నను స్థానికులు సంధిస్తున్నారు.