వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవటం తెలంగాణ అధికారపక్షానికి కొత్తేం కాదు. వారెప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో ఎన్నో నిర్ణయాలపై సుప్రీం.. హైకోర్టు అక్షింతలు వేసిన వైనం తెలిసిందే.
అయినప్పటికీ.. ఏదైనా విధానం ప్రకటించే ముందు.. దాని పర్యవసానంగా వచ్చే పరిణామాల గురించి సరైన కసరత్తు లేకుండా ప్రకటించటం.. అనంతరం దానిపై వచ్ వ్యతిరేకతతో వెనక్కి తగ్గటం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో కోర్టు చేసే సూచనలతో తమ నిర్ణయాల్ని వెనక్కి తీసుకుంటుంటారు. తాజాగా గుడుంబాను అరికట్టేందుకు వీలుగా చీప్ లిక్కర్ తీసుకురావాలని తెలంగాణ సర్కారు భావించటం.. దానిపై రాజకీయ పార్టీలతో పాటు.. పలు వర్గాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించటం తెలిసిందే.
చీప్ లిక్కర్ కారణంగా.. ప్రభుత్వానికి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ అధికారపక్షం ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటంతో.. ధానికి సంబంధించి క్రెడిట్ వాదన మొదలైంది.
చీప్ లిక్కర్ పై తాము అలుపెరగని పోరాటం చేశామని.. తమ పోరాటాలతో తెలంగాణ అధికారపక్షాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను వణికించామని.. ఈ కారణంతోనే తెలంగాణ రాష్ట్ర సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకోవటం మొదలు పెట్టారు. తెల్లవారగానే.. రాజకీయ విశ్లేషణలపై టీవీ చానళ్లు నిర్వహించే చర్చకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. చీప్ లిక్కర్ పై తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గటం తమ విజయంగా వారు అభివర్ణించుకోవటం కనిపించింది. విజయమంతా తమ ఖాతాలోకి వేసుకుంటే.. మిగిలిన రాజకీయపక్షాలు ఊరుకుంటాయా? వారు కూడా గళం విప్పటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.