కాంగ్రెస్ లో అసమ్మతి సెగ మరింత రగులుతున్నది. అభ్యర్థుల తొలి జాబితా వెలువడకముందే టికెట్లను ఆశిస్తున్న నాయకులు తమ అనుచరగణంతో అధిష్ఠానంపైకి దండెత్తుతున్నారు. తమకు టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. నామినేషన్ల సమయం దగ్గరపడుతున్న కొద్దీ హస్తం పార్టీలో వాతావరణం మరింత వేడెక్కుతున్నది. ధర్నాలు - హర్తాళ్లు - నిరసనలు - నినాదాలతో గాంధీభవన్ శనివారం కూడా హోరెత్తిపోయింది. సెక్యూరిటీతో తోపులాటలు - కొందరు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొన్నది. మొత్తానికి నాయకుల ఆధిపత్య పోరుతో గాంధీభవన్ వరుసగా మూడోరోజు రణరంగాన్ని తలపించింది.
ఈ నేపథ్యంలో సీట్ల ప్రకటనపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తుండటంపై కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తోందని అనుకున్నప్పటికీ అసలు విషయం అసమ్మతి భయం అని అంటున్నారు. రాష్ట్రంలో తమ ప్రత్యర్థి అధికార టీఆర్ ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లుంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా ఎంపిక వద్దే ఉండటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. స్క్రీనింగ్ కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపినా టిక్కెట్లు పంపిణీ ఇంకా చేయలేదు. రెబెల్స్ బెడద తట్టుకునేందుకు ఈ పంథా అవలంభిస్తున్న ట్టు సమాచారం. ఇప్పటికే రెబెల్స్ స్క్రీనింగ్ కమిటీతో నిత్యం భేటీ అవుతుతున్నారు. తమ కు టిక్కెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొంతమంది హెచ్చరిస్తున్నారు. కాగా, మరి కొంతమంది మాత్రం తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విన్నవించుకుంటున్నారు.
అధికార పార్టీని మట్టి కరిపించేందుకు కాంగ్రెస్ కూటమిలోని పలు పక్షాలతో ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహా కూటమి వల్ల కాంగ్రెస్ లోని చాలా మంది ఆశావాహులకు పార్టీ న్యాయం చేయలేక పోతున్నది. అయితే ఆ లోటును ఏ విధంగా భర్తీ చేయాలన్న విషయంపై పార్టీ హైకమాండ్ కూడా తీవ్రంగా యోచిస్తోంది. కొంతమంది కీలక నేతలకు మాత్రం నామినేటెడ్ పదవులు ఆశ చూపుతున్నారు. అయినప్పటికీ వారిని తట్టుకునే పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అందువల్లే అభ్యర్థుల ప్రకటన ఆగిపోయిననట్లు సమాచారం.