కాంగ్రెస్ తొలి జాబితా ఇదేనా?

Update: 2018-09-29 08:40 GMT
ఒకేసారి 105 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన టీఆర్ ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌నానికి తెర తీస్తే.. ఆయ‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన నెల రోజుల‌కు కూడా ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌ని వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

టీఆర్ఎస్ ను ఏ ఒక్క‌పార్టీ తెలంగాణ‌లో సొంతంగా ఎదుర్కొలేని నేప‌థ్యంలో కాంగ్రెస్‌..టీడీపీ.. కోదండం మాష్టారి పార్టీతో పాటు సీపీఐ క‌లిసి మ‌హా కూట‌మిలా ఏర్ప‌డి పోటీకి దిగాల‌ని భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా సీట్ల లెక్క‌ల్లో పార్టీలు మునిగిపోయాయి. క్యాలెండ‌ర్లో రోజులు మారుతున్నా.. పొత్తుల‌పై క్లారిటీ రాక‌పోవ‌టం.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాల‌న్న అంశంపై ఎవ‌రి వాద‌న వారిదే త‌ప్పించి.. అంత‌కు మించి ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌ని ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. కాంగ్రెస్ కు చెందిన 40 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన జాబితా ఒక‌టి విడుద‌ల చేసేందుకు కాంగ్రెస్ రెఢీ అవుతుంద‌న్న మాట వినిపిస్తోంది. తొలిద‌శ‌లో సీనియ‌ర్ నేత‌లు ప్రాతినిధ్యం వ‌హించే అభ్య‌ర్థుల జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేశార‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ విడుద‌ల చేసేతొలి జాబితా ఇలానే ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత‌కీ.. తొలి జాబితాలో ఉండే 40 మంది అభ్య‌ర్థులు.. వారు బ‌రిలోకి దిగే అసెంబ్లీ స్థానాలు చూస్తే..

+  మర్రి శశిధర్‌ రెడ్డి (సనత్‌ నగర్‌)
+  టి.జీవన్‌ రెడ్డి (జగిత్యాల)
+  శ్రీధర్‌బాబు (మంథని)
+  ఎ.లక్ష్మణకుమార్‌ (ధర్మపురి)
+  ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు)
+  మల్లు భట్టివిక్రమార్క (మధిర)
+ రేగా కాంతారావు (పినపాక)
+  రేవంత్‌ రెడ్డి (కొడంగల్‌)
+  జి.చిన్నారెడ్డి (వనపర్తి)
+  డి.కె.అరుణ (గద్వాల)
+  ఎస్‌.ఎ.సంపత్‌ కుమార్‌ (అలంపూర్‌)
+  వంశీచంద్‌ రెడ్డి (కల్వకుర్తి)
+  టి.రామ్మోహన్‌ రెడ్డి (పరిగి)
+  సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం)
+  ప్రతాపరెడ్డి (షాద్‌నగర్‌)
+  ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌)
+  దామోదర్‌ రాజనర్సింహ  (ఆంథోల్‌)
+  సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్‌)
+  గీతారెడ్డి (జహీరాబాద్‌)
+  జగ్గారెడ్డి (సంగారెడ్డి)
+  ప్రతాపరెడ్డి (గజ్వేల్‌)
+  కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ)
+  ఆర్‌.దామోదర్‌రెడ్డి (సూర్యాపేట)
+  జానారెడ్డి (నాగార్జునసాగర్‌)
+  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్‌)
+  పద్మావతి (కోదాడ)
+  బిక్షమయ్యగౌడ్‌ (ఆలేరు)
+  సుదర్శన్‌ రెడ్డి (బోధన్‌)
+  షబ్బీర్అలీ (కామారెడ్డి)
+  అనిల్‌ (బాల్కొండ)
+  పొన్నాల లక్ష్మయ్య (జనగాం)
+  దొంతిమాధవరెడ్డి (నర్సంపేట)
+  గండ్ర వెంకట్రమణారెడ్డి (భూపాలపల్లి).



Tags:    

Similar News