మహాకూటమి పేరుతో విపక్షాలను ఏకం చేసిన కాంగ్రెస్ చివరి నిమిషంలో ఆయా పార్టీలకు తనదైన శైలిలో షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజైన సోమవారం మహాకూటమి పార్టీలకు కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ చేసింది. ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ లు ఇచ్చి కాంగ్రెస్ మార్క్ రాజకీయాన్ని రుచి చూపించింది. కూటమి పేరుతో టీజేఎస్ ను హస్తం పార్టీ నిండా ముంచింది. టీజేఎస్ కు కేటాయించిన ఆరు సీట్లలో నాలుగింటిలో కాంగ్రెస్ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. హుజురాబాద్ - దుబ్బాక - వరంగల్ ఈస్ట్ - పఠాన్ చెరు లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫామ్స్ ను అందజేసింది.
కూటమి పెద్దన్నగా వ్యవహరించిన కాంగ్రెస్ తీరుతో టీజేఎస్ నేతలు షాక్ కు గురయ్యారు. ఇన్నాళ్లు నమ్మించి కాంగ్రెస్ తమను మోసం చేసిందని టీజేఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూరలో కరివేపాకులాగా తమను వాడుకొని వదిలేశారని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న సమయంలో టీజేఎస్ ఎలా స్పందించాలో తెలియని స్థితికి చేరింది.
మరోవైపు టీజేఎస్ పై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం క్రమంగా పట్టు కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. కూటమితో తగిన రీతిలో సీట్ల సర్దుబాటు చేసుకోవడంలో కోదండరాం విఫలమవడంతో..ఆ పార్టీలోని ఇతర ముఖ్యనేతలు అమీతుమీ తేల్చుకోవటానికి సిద్ధపడ్డారని తెలుస్తున్నది. ప్రత్యేకించి కాంగ్రెస్ వైఖరి పట్ల టీజేఎస్ లోని ముఖ్యనేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పుణ్యకాలం గడిచిపోతున్న సమయంలో ఏం చేశారంటూ కోదండరాంపై తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాగా, చర్చలు - సంప్రదింపుల్లో కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో కోదండరాం మౌనం వహించారని - అందుకే మీడియాకు కూడా అందుబాటులో ఉండటం లేదని పలువురు అంటున్నారు.